TG Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వింతగా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే.. ఇంకో వైపు ఎండలు భగ భగ మండుతున్నాయి. అయితే, తాజాగా తెలంగాణకు భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజూ, రేపు కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఈ నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Also Read: Balagam Actor: ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు సంతాపం
ఇటీవలే ప్రవేశించిన రుతుపవనాల చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళ వారం మహబూబ్నగర్ జిల్లా వరకు విస్తరించాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండదని తెలిపింది.
Also Read: Suravaram Pratap Reddy University: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. నోటిఫికేషన్ రిలీజ్!
అయితే, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో గంటకు 50 – 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.