Anaganaga Oka Raju
ఎంటర్‌టైన్మెంట్

Anaganaga Oka Raju: రాబోయే సంక్రాంతి బరిలో నవీన్‌ పోలిశెట్టి సినిమా.. పారిపోండిరోయ్!

Anaganaga Oka Raju: ఏడాది అంతా ఎలా ఉన్నా.. సంక్రాంతికి మాత్రం విడుదలయ్యే సినిమాల విషయంలో ఎప్పుడూ ఆసక్తికరమైన పోటీ ఉంటుందనే విషయం తెలియంది కాదు. అందుకే సంక్రాంతి బరిలో దిగేందుకు ముందుగానే డేట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కొందరు స్టార్ హీరోలు. కానీ ఈసారి సంక్రాంతికి ముందుగానే డేట్ రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు నవ్వుల రారాజు ‘అనగనగా ఒక రాజు’. అర్థం కాలేదు కదా.. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్నవాళ్లని నవ్విస్తూ ఉండే నవ్వుల మెషీన్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సినిమా రాబోయే సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతే, అందరూ కామెడీగా ‘మిగతావాళ్లంతా పారిపోండిరోయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు

తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ప్రేక్షకులలో సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్‌ పోలిశెట్టి. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. మధ్యలో యాక్సిడెంట్‌‌కి గురై, కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ఈ మధ్యనే ఓ సినిమా ప్రకటించారు. అదే ‘అనగనగా ఒక రాజు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నవీన్‌ పోలిశెట్టి మరోసారి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడనే విషయం మోషన్ పోస్టర్‌తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్లుగా తెలుపుతూ, అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

Also Read- Kandula Durgesh: సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించం!

తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి ఫెస్టివల్‌ను సినిమా పండుగలా భావిస్తుంటారనే విషయం తెలియంది కాదు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఆ విషయం ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరోసారి నిరూపించింది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ ఫిక్సయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నవీన్‌ పోలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయం అవుతుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ముందు అనుష్క శెట్టితో కలిసి నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!