Sardar 2: తమిళ నటుడు కార్తి (Actor Karthi)కి కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఓ తెలుగు హీరోగానే కార్తిని చూస్తారు. ఎందుకంటే, ఆయన మాట్లాడే తెలుగు అంత స్పష్టంగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరోలైన రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి వారు కూడా అంత చక్కగా తెలుగు మాట్లాడలేరు. అందుకే, తెలుగు భాషపై ఆయన అంత ప్రేమ చూపిస్తాడు కాబట్టే, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమతో ఆయనకు రిటన్ గిఫ్ట్‌గా ప్రేమ ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం కార్తి లైనప్ చూస్తుంటే, అతి త్వరలోనే ఆయన స్టార్ హీరోగా తగిన బిరుదును సొంతం చేసుకోబోతున్నాడనేది స్పష్టమవుతుంది. మే 25 కార్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్స్‌ని ఆయా చిత్రాల నిర్మాతలు విడుదల చేస్తున్నారు.
Also Read- Bunny Vas: పవన్ కళ్యాణ్‌నే ఇరిటేట్ చేశామంటే.. బన్నీ వాసు పోస్ట్ వైరల్
ఈ క్రమంలో విడుదలైన ‘సర్దార్ 2’ లుక్ ప్రస్తుతం వైరల్ కాబోతోంది. కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్.. ‘సర్దార్ 2’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ (Prince Pictures) గ్రాండ్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ యాక్టర్ ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హీరో కార్తి బర్త్‌డేని పురస్కరించుకుని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కార్తి మ్యాసీవ్ మిషన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూడగానే వావ్.. అదిరింది అనేలా డిజైన్ చేశారు. సినిమాలో కార్తి పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో ఈ పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read- Kiran Royal: పవన్ సినిమాపై కక్ష కడతారా.. మీకు జగనే కరెక్ట్.. కిరణ్ రాయల్ ఫైర్!
‘సర్దార్ 2’ భారీ బడ్జెట్‌తో హ్యూజ్ స్కేల్‌లో రూపుదిద్దుకుంటోంది. ‘సర్దార్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్, రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
