Panchayat Raj Jobs ( Image Source: Twitter)
తెలంగాణ

Panchayat Raj Jobs: పంచాయతీ రాజ్ లో ప్రమోషన్లకు మోక్షం కలిగేనా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులు ప్రమోషన్లకు నోచుకోవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టిసారించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. కేడర్ బలోపేతం ప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోకపోవడం, ప్రభుత్వం సైతం పెండింగ్ లో పెడుతుందని సమాచారం.ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి సీనియర్ అధికారుల లిస్టును పంపించినట్లు తెలిసింది.

రాష్ట్రంలోని కీలకశాఖల్లో ఒకటి పంచాయతీరాజ్ శాఖ. ఈ శాఖ గ్రామీణ వ్యవస్థ పటిష్టతకు పాటుపడుతుంది. అయితే ఈశాఖలో ఏళ్లతరబడి ప్రమోషన్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రమోషన్ కు అన్ని అర్హత ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన జీవో రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాఖలో పనిచేస్తున్న ఎంపీడీఓలు, డీపీఓలు, డీఆర్ డీఓలకు నిరీక్షిస్తున్నారు. 37మంది ఎంపీడీఓలు ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. అయితే, డీపీఓలు, డిప్యూటీ సీఈఓలుగా, డీఆర్డీఓలుగా ప్రమోషన్లు రావల్సి ఉంది. పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అందుకు సంబందించిన లిస్టును సైతం తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అయితే, ఒకపోస్టు పదోన్నతికి గానూ 3 అధికారుల పేర్లను పంపినట్లు విశ్వసనీయ సమాచారం.

రెండు సార్లు లిస్టు పంపిన అధికారులు?

గత ఆరు నెలల క్రితం అధికారులు ప్రమోషన్లకు అర్హులుగా ఉన్న అధికారుల పేర్లను పంపారు. అయితే ఉన్నతాధికారులు ఆ లిస్టును పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. 6 నెలలు గడిచిన లిస్టుకు మోక్షం కలుగకపోగా మరోసారి అధికారుల లిస్టును పంపాలని సూచించినట్లు తెలిసింది. దీంతో, నెల క్రితం పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రమోషన్లకు అర్హులైన అధికారుల లిస్టును పంపినట్లు సమాచారం. అయితే, ఇప్పుడైనా ఆ ఫైల్ కు మోక్షం కలుగుతుందా? లేదా? అనేది చూడాలి.

సీఎం ఆమోదం కోసం ఎదురుచూపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. అందులో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాల నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఈ తరుణంలోనే ప్రస్తుతం శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తే వారి స్థానంలో మరొకరికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ప్రమోషన్లపై మంత్రి సీతక్క సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమోషన్ల లిస్టును సీఎం ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. ఆ ఫైల్ కు ఎప్పుడు మోక్షం కలుగుతుందనేది ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు