Theatres Strike Postponed: గత కొన్ని రోజుల నుంచి సినిమా థియేటర్లు బంద్ అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఎక్స్ లో ట్వీట్ పెట్టారు.
” సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్కృతిక విలువల ప్రతిబింబంగా, వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతోంది. ఈ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రజల అభిరుచి, కళాకారుల హక్కులు, పరిశ్రమలో ఉన్న శ్రమజీవుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతామని అన్నారు. కారకులు ఎవ్వరైనా సరే వదిలిపెట్టమని ” ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్ల డిమాండ్ పై ఫిలిం ఛాంబర్ లో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడారు.
” థియేటర్లు మూసివేయడం లేదు.. అలాగే, ఎలాంటి బంద్ కూడా లేదు. ఈ నెల 30 వ ఈసి మీటింగ్ లో కమిటీ వేస్తాం.ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశంపై ఓ కమిటీ వేసి.. దానికి ఒక టైం లైన్ పెట్టుకొని, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని సమస్య ను పరిష్కరిస్తామని అన్నారు. అప్పటివరకు థియేటర్ల బంద్ నిలిపివేస్తున్నామని ” తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంటే.. ఇప్పుడే సింగిల్ థియేటర్లు మూసివేత అని తెర పైకి ఎందుకు తీసుకొచ్చారు. పవన్ ప్రయత్నం చేస్తున్నప్పటీకి తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు.
ఇప్పటికే, ఆ సినిమా ఎన్నో గండాలను నుంచి బయట పడి మన ముందుకు రావడానికి సిద్దమవుతోంది. నాలుగేళ్లు నుంచి ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో అడ్డంకులు, సమస్యలను ఎదుర్కొని.. సినిమాను రిలీజ్ చేస్తుంటే.. కొందరు అడ్డుకుని నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెడుతున్నారు. చూడబోతుంటే పవన్ సినిమాకు ఈ సారి కూడా గండం తప్పేలా లేదు.మరి, చివరికి ఏం జరుగుతుందో చూడాలి.