Actor Sumanth: తెలుగు హీరో అక్కినేని సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, చాలా కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు ‘అనగనగా’ తో మన ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ మే 15న ఈటీవీ విన్‌లో రిలీజ్ అయింది. అయితే, ఈ నేపథ్యంలోనే మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ కు గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని సుమంత్ రాజమౌళి గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరి దగ్గరికైనా వెళ్లి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగాల్సి వస్తే ఎవరి వద్దకు వెళ్తారు. నార్మల్ గా చాలా మొహమాట పడతారని విన్నాము. మరి, మీరు అడుగుతారా ? అడగరా అని యాంకర్ అక్కినేని సుమంత్ కి అడగగా నమ్మలేని నిజాలను బయటపెట్టాడు.
లేదు అండి నేను అడుగుతాను. అలా ఏం లేదు. అంటే నాకు అందరితో పరిచయం లేదు. ఉన్న వాళ్ళతో అడుగుతా.. 20 ఏళ్ల క్రితం రాజమౌళి దగ్గరకు వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగా .. ఏదైనా క్యారెక్టర్ ఉంటే నాకు చెప్పండి .. నేను చేస్తాను అని చెప్పాను. నా జీవితంలో అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పాడు. అంతే కాదు, నేను ప్రత్యేకంగా ఆయన వద్దకే వెళ్ళానని షాకింగ్ కామెంట్స్ చేశాడు.