Covid panic (imagecreit:twitter)
తెలంగాణ

Covid panic: హైదరాబాద్‌లో కొవిడ్‌ కలకలం – వైద్యుడికి పాజిటివ్!

Covid panic: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ మోదలైంది. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

వైద్యుల జాగ్రతలు సూచనలు:

కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో ఓంటరిగా ఉండాలని, వైద్యుల సలహాలు సూచనలు తోసుకొని మందులు వాడాలని సూచించారు. ప్రయాణాలు జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు. కొవిడ్‌ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యలు సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

Also Read: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

కేసులు నమోదు:

మే 19 నాటికి దేశంలో 257 కొవిడ్ కేసులు ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వివిధ దేశాల్లో మరియు సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తమయ్యామని పేర్కొంది. సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్‌ పెరుగుదల తీవ్రంగా ఉందని, వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు.

Also Read: Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన మెట్రో చార్జీలు ఇవే!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!