Kishan Reddy: తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 మోడీ ప్రభుత్వం వచ్చాక అనేక ఇనిస్టిట్యూషన్స్ స్థాపించడం జరిగిందని అన్నారు. తాజాగా మూడు కొత్త ఇనిస్టిట్యూషన్స్ తెలంగాణకు వచ్చాయని ప్రకటించారు. మిల్లెట్స్ పై పరిశోధనల కోసం అంతర్జాతీయ సంస్థ తెలంగాణకు వచ్చిందని చెప్పారు. రూ.250 కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ సెంటర్ అఫ్ ఎక్సలెన్సీ మిల్లెట్స్ సంస్థ (Global Centre of Excellence on millets) ను కేంద్రం.. తెలంగాణకు తీసుకొచ్చిందిన కిషన్ రెడ్డి అన్నారు.
కవాచ్ ఎక్స్ లెన్స్ సెంటర్
గ్లోబల్ మిల్లెట్స్ సంస్థ ద్వారా అనేక రీసర్చ్ సెంటర్స్ అందుబాటులోకి రాబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. దాని వల్ల ఇక్కడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా అనేక ప్రొడక్ట్స్ అందుబాటులోకి వస్తాయని మార్కెటింగ్ వ్యవస్థ కూడా పెరుగుతుందని అన్నారు. రైళ్ల భద్రతకు స్పందించి కవాచ్ ఎక్సలెన్స్ సెంటర్ కూడా హైదరాబాద్ కు రాబోతుందని అన్నారు. సికింద్రాబాద్ సెంటర్ గా కవాచ్ పనిచేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.274 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. రైల్వే భద్రతలో కవాచ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
రాష్ట్రంలోని అకాల వర్షాలపై
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయడాకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంపై నయా పైసా ఖర్చు పడకుండా కేంద్ర ప్రభుత్వమే మెుత్తం చూసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అదనంగా కొనుగోలు సెంటర్స్ ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వానికి సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దానిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపడతామని తమ పార్టీ మేనిఫెస్ట్ లో సైతం ఉందని అన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి.. కాళేశ్వరంలో జరిగిన అవకతకవకలను సీబీఐ కి అప్పజెప్పాలని కోరారు.
Also Read: Anantapur News: జగన్ ఫొటో ఎఫెక్ట్.. అధికారిపై ప్రభుత్వం బదిలీ వేటు
బీఆర్ఎస్ మునిగిపోయే నావ!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖపైనా కిషన్ రెడ్డి స్పందించారు. ఆమె లేఖపై అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కుటుంబ పార్టీల వల్లే ఇట్లాంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని అన్నారు. డాడీ – డాటర్ లేఖలో కంటెంట్ లేదని.. అదో పెద్ద డ్రామా అని అన్నారు. బీఆర్ఎస్ డాటర్, సన్ పార్టీ అని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ పార్టీ మునిగిపోతున్న నావ అని స్పష్టం చేశారు. బీజేపీపై 2 నిమిషాలు మాట్లాడుతావా డాడి అంటూ కవిత అంటున్నారని.. 10 ఏళ్ల నుంచి తిడుతూనే ఉన్నారు కదా ఆది చాలదా? నిలదీశారు.