CM Revanth Court
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Revanth Reddy: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్.. ఎందుకంటే..?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసుల్లో రేవంత్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను ఎవ్వరినీ అనుమతించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నల్గొండ టూ టౌన్, బేగంబజార్, మెదక్​జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లోనే ముఖ్యమంత్రి గురువారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెబుతున్నవన్నీ అవాస్తవాలని, తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ధర్మాసనంకు వివరించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన కోర్టు తీర్పును జూన్​12కు రిజర్వ్​చేసింది. విచారణ ముగిసిన అనంతరం కోర్టు నుంచి రేవంత్ రెడ్డి తిరిగి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఆయన సీఎం హోదాలో కోర్టుకు హాజరుకావడం ఇది రెండోసారి.

CM Revanth Convoy

రేపు జహీరాబాద్‌కు రేవంత్..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. రూ.500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్, ఎంపీ సురేష్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తదితరులు జహీరాబాద్ చేరుకొని ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో అక్కడే సమీక్ష కూడా నిర్వహించారు. 65వ నేషనల్ హైవే నుంచి జార సంఘం నింజి ప్రాజెక్ట్ వరకు రూ.100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫోర్‌లేన్ రోడ్డు, మాచ్నూర్‌లో రూ. 26 కోట్లతో 11. 8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే బ్రిడ్జి, ప్రారంభోత్సవంతో పాటు బసవేశ్వర విగ్రహావిష్కరణ కూడా చేయనున్నారు. దీంతోపాటు మరో రూ.250 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదిలా ఉండగా నీంజ్జు ప్రాజెక్టు వద్ద సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ క్రాంతి దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. జిల్లా అధికారుల బృందం జహీరాబాద్‌లోనే ఉంది.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?