Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు ఇప్పటికీ కూడా మారుమోగుతుంది. ఈ పేరంటే తెలియని వాళ్లుండరు. గత కొద్దీ కాలం క్రితం సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగింది. సాధారణ క్యాంటీన్ నడిపే కుమారి ఆంటీ ఇప్పుడు సెలబ్రిటిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వాన్నే కదిలించిన ఈ ఆంటీ.. ఇప్పుడు సైలెంట్ అయ్యి తన పని తాను చేసుకుంటుంది.
ఎలా ఫేమస్ అయింది?
“హయ్ నాన్న.. మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా..” అనే ఒక్క మాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఎంతో మంది ఆమె వద్దకు వెళ్లి 2 లివర్స్ ఎక్స్ ట్రా అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియో చేశారు. అలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది.
Also Read: Actress Saiyami Kher: బెడ్ ఎక్కితేనే ఆఫర్ ఇస్తా అన్నాడు.. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
మొత్తం వాళ్లే చేశారు?
అయితే, ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. అసలు నాకు ఇంత వరకు సోషల్ మీడియా గురించే తెలీదు. దాని వలన లాభ నష్టాలు కూడా తెలియవు. కానీ, దీని వలన శత్రువులు ఎక్కువయ్యారు. ఎంత పేరు వచ్చిందో ? అంతకుమించి అవమానాలు కూడా అలాగే జరిగాయి. దీని వలన చాలా బాధ పడ్డాను. ఒకప్పుడు నాకు అందరూ మంచిగా ఉండేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ నాతో సరిగా ఉండటం లేదు. ఈ రోజున ఇలా ఉన్నాను అంటే నా కస్టమర్ దయ వలనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: RGV: కియారా అద్వానీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఎవరూ హెల్ప్ చేయడం లేదు?
అంతకు ముందు నా దగ్గర ప్లేట్స్, రైస్ అయిపోతే ఇచ్చే వాళ్ళు.. కానీ, ఇప్పుడు ఉంచుకుని కూడా లేవు అంటున్నారు. ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అప్పుడు ఇక అర్దమైంది. సోషల్ మీడియా వలన మంచి పక్కన పెడితే .. శత్రువులను ఎక్కువగా తెచ్చి పెడుతుంది. అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి అనుకునే దానిని. ఒకరి చెడు కోరుకునే దానిని కాదంటూ ఏమోషనల్ అవుతూ చెప్పింది.