BRS vs Congress (imagecredit:twitter)
తెలంగాణ

BRS vs Congress: గులాబీ ఎటాక్!.. అటెన్షన్ డైవర్షన్ పార్టీ క్యాడర్‌లో చర్చ!

BRS vs Congress: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నోటీసుల పేరుతో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్లు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నదని, మేడిగడ్డను పునరుద్దరిస్తే రైతులకు సాగునీరందుతుందని, అది చేయకుండా బీఆర్ఎస్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌లో మాత్రం ఏం జరుగుతుందోనన్న ఆసక్తికర చర్చ జరుగుతున్నది.

మూడు పిల్లర్లు కుంగితే రాజకీయమా?

కాళేశ్వరం ప్రాజెక్టులో 85 పిల్లర్స్ ఉంటే అందులో 3 పిల్లర్స్ కుంగితే బాగు చేయాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. లక్షల ఎకరాలకు నీరందింస్తున్న ప్రాజెక్టుకు మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేయాల్సిందిపోయి కాలయాపనచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని మండిపడుతున్నారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదగడంతోనే టార్గెట్ చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతోనే కుస్తీ పడుతున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే విచారణ పేరుతో నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరోదారి కనిపించడం లేదని, పాలనను గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. కేంద్రం సైతం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, మెడికల్ కాలేజీలు గానీ, కేంద్రీయ విద్యాలయాలు గానీ, డ్రైపోర్టు ఇలా ఏది ఇవ్వకుండా మొండిచెయ్యి చూపుతున్న తీరును ఎండగడుతున్నారు.

Also Read: Seethaka on Harish Rao: బహిరంగ లేఖలు రాయడం మాని ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి.. హ‌రీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్!

నోటీసులను అస్రంగా వాడుకునేలా

నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నది. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని, దానికి నోటీసులే నిదర్శనమని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నేతలు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ల దందాను దారి మళ్లించేందుకే ఈ నోటీసులు అని విమర్శలు చేస్తున్నారు. తాము నోటీసులకు బెదరమని స్పష్టం చేస్తూనే ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ భావిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు అని, అటెన్షన్ ‌డైవర్ట్ రాజకీయమే కాదు, గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతున్నదని, మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా చేస్తే ఏపీకి గోదావరి నీళ్లు తరలించే కుట్ర జరుగుతున్నదని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా, పార్టీ కేడర్‌లోనూ కేసీఆర్‌కు నోటీసులపై చర్చజరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా? ప్రభుత్వం కుట్రతో చేస్తుందా? ఒక వేళ అవినీతి జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది క్యాడర్ చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు అవుతారా? అనేదానిపైనా ఆసక్తి నెలకొంది. లేకుంటే ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ పేరుతో కాలయాపన చేయాలని చూస్తుందా? అనే చర్చకూడా మొదలైంది. ఏది ఏమైనా కాళేశ్వరం కమిషన్ ఏం చేయబోతున్నది? కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Etela Rajender: బెదిరిస్తే భయపడం.. సీఎంకు ఎంపీ ఈటల సవాల్!

 

 

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ