Actress Saiyami Kher: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు వినపడుతూనే ఉంటుంది. ఒకప్పుడు దీని గురించి మాట్లాడే మాట్లాడాలన్నా కూడా చాలా భయపడే వాళ్ళు.. కానీ ఇప్పటి హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు.
Also Read: Actor Sumanth: ఆమె వచ్చి అడిగితే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్న సుమంత్.. పెళ్లి గురించేనా?
కొందరు సినీ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను ఇంటర్వ్యూ లో పంచుకుంటున్నారు. తాజాగా, ఈ లిస్ట్ లో సయామి ఖేర్ కూడా చేరింది. ఈ హాట్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే. 2021 లో వచ్చిన `వైల్డ్ డాగ్` చిత్రంలో నాగార్జునతో కలిసి సయామి నటించారు. ముంబై కి చెందిన ఈ బ్యూటీనీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది మెగా హీరోనే. 2015లో వైవిఎస్ చౌదరి నిర్మించి దర్శకత్వం వహించిన `రేయ్` మూవీలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా సయామి ఖేర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఇదే ఆమెకు తెలుగులో మొదటి చిత్రం.
Also Read: CISF Recruitment 2025: ఇంటర్ అర్హతతో CISFలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ” కెరీర్ మొదట్లో ఎన్నో చేదు అనుభవాలు చూశాను. 19 ఏళ్ల వయసులోనే తెలుగులో ఒక చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఓ మహిళా క్యాస్టింగ్ ఏజెంట్ నాకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితేనే మూవీలో ఛాన్స్ వస్తుందని చెప్పింది. ఒక అమ్మాయి ఉండి అలా ఓపెన్ గా చెప్పడంతో నేను షాక్ అయ్యాను. అలాంటి ఆఫర్ వద్దని వెంటనే రిజెక్ట్ చేశానని ” చెప్పింది.