Mohan Lal in Kannappa
ఎంటర్‌టైన్మెంట్

Lalletan: ‘కన్నప్ప’ నుంచి మోహన్ లాల్ స్పెషల్ గ్లింప్స్.. ఇప్పుడు దారిలోకి వచ్చారు

Lalletan: మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రం (Kannappa Movie) ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి, జూన్ 27న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అమెరికాలోనూ ఈ చిత్ర ప్రమోషన్స్‌ని నిర్వహిస్తూ.. బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఒకవైపు, మోహన్ లాల్ బర్త్‌డేని (HBD Lalletan Mohan Lal) పురస్కరించుకుని వదిలిన గ్లింప్స్ ఒకవైపు అన్నట్లుగా.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో ఈ గ్లింప్స్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

Also Read- Om Raut: ‘కలాం’ బయోపిక్.. ‘ఆదిపురుష్’ దర్శకుడి చేతికి చిక్కిన మరో సౌత్ హీరో!

మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా ఇప్పుడు వరుసగా రూ. 200 కోట్ల వసూళ్లను రాబడుతూ టాక్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీగా మారుతున్నాయి. ఇప్పుడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్, పాన్-ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’లోనూ ఆయన ఓ పవర్ ఫుల్ రోల్ పోషించారు. మోహన్ లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా కన్నప్ప నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ‘కన్నప్ప’ టీమ్ ఇప్పుడు దారిలోకి వచ్చిందనే టాక్‌కు కారణమవుతోంది.

Also Read- RGV: కియారా అద్వానీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

‘కన్నప్ప’ మేకర్లు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ విషయానికి వస్తే.. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కనిపించిన తీరు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మోహన్ లాల్ ఈ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులపై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ గ్లింప్స్‌ను మేకర్స్ కట్ చేశారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా వచ్చిన ఈ గ్లింప్స్‌లో దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను ఆయన పోషించారు. కిరాత పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటివి ఇంకో రెండు మూడు గ్లింప్స్‌లు ఈ సినిమా నుంచి పడితే.. కచ్చితంగా ‘కన్నప్ప’ జనాల్లోకి వెళ్లిపోతుందనేలా టాక్ మొదలైంది. మరి ఈ దిశగా ‘కన్నప్ప’ మేకర్స్ ఆలోచన చేస్తారేమో చూద్దాం. ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు