Hari Hara Veeramallu: దర్శకనిర్మాతలు చెప్పిన ఆసక్తికర విషయాలివే..
Hari Hara Veeramallu Update
ఎంటర్‌టైన్‌మెంట్

Hari Hara Veeramallu: దర్శకనిర్మాతలు చెప్పిన ఆసక్తికర విషయాలివే..

Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం. రత్నం (AM Rathnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ పాట ‘అసుర హననం’ను మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకనిర్మాతలు తెలియజేశారు.

Also Read- Om Raut: ‘కలాం’ బయోపిక్.. ‘ఆదిపురుష్’ దర్శకుడి చేతికి చిక్కిన మరో సౌత్ హీరో!

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి డ్రీమ్ ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్‌కి పెద్ద పునాది వేసింది క్రిష్. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని నాన్న ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. పవన్ కళ్యాణ్, రత్నంని మెప్పించడం నార్మల్ విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో అంతా ఊహించుకోవచ్చు. ఆస్కార్ విజేతతో పని చేసినందుకు గర్వంగా ఉంది. కీరవాణి అందరినీ ప్రోత్సహిస్తారు. రాంబాబుకు సిట్యుయేషన్ చెప్పి, పాట రాయించుకొని కీరవాణిని కలిస్తే.. సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కూడా ఎంతో ప్రోత్సహించారు. ఓ వైపు ప్రజాసేవ, మరోవైపు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ విశ్రాంతి తీసుకోకుండా పవర్ స్టార్ ఎంతో శ్రమిస్తున్నారు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్న మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ‘హరి హర వీరమల్లు’ కథ అని అన్నారు.

Also Read- Rana Naidu Season 2: బూతుల వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. దాదాపు ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాము. మీడియా మద్దతుతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నాను. ఇది మొదటి ప్రెస్ మీట్. మరో రెండు భారీ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇంత భారీ సినిమాకి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉందని భావిస్తున్నాం. అందుకు మీడియా కూడా సహకరించాలని కోరుతున్నాను. సినిమా ఫీల్డ్‌లో నా జర్నీ 54 ఏళ్ళు. తెలుగు, తమిళ, హిందీ వంటి భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు సక్సెస్ సాధించాయి. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. ‘భారతీయుడు, ఒకే ఒక్కడు’ వంటి సినిమాలు అందించాను. ‘హరి హర వీరమల్లు’ సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్. క్రిష్ చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం జడ్జిమెంట్‌ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. క్రిష్ తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాని పూర్తి చేశాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి