Om Raut: ‘కలాం’.. ‘ఆదిపురుష్’ దర్శకుడి చేతికి చిక్కిన మరో సౌత్ హీరో!
Om Raut Movie with South Star Hero
ఎంటర్‌టైన్‌మెంట్

Om Raut: ‘కలాం’ బయోపిక్.. ‘ఆదిపురుష్’ దర్శకుడి చేతికి చిక్కిన మరో సౌత్ హీరో!

Om Raut: ఓం రౌత్.. ఈ పేరు వినబడితే చాలు ‘ఓం.. కమ్ టు మై రూమ్’ అని ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) అనుకున్న రోజులు అందరికీ గుర్తుకు వస్తాయి. రెబల్ స్టార్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరో డేట్స్ ఇస్తే.. దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి ఓ నాసిరకం సినిమా తీసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ఓం రౌత్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమా ప్రభాస్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు ఒక పీడకలగా మారిపోయింది. అప్పటి నుంచి ఓం రౌత్ అంటే చాలు, సౌత్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు మండి పడుతున్నారు. అలాంటి ఓం రౌత్‌, ఇప్పుడు మరో సౌత్ ఇండియా స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. అదీ కూడా, భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జీవిత చరిత్రతో సినిమా చేయబోతున్నాడు. దీంతో ఈసారి ఏం చేస్తాడో అని అంతా అప్పుడే మాట్లాడుకుంటుండటం విశేషం. ‘కలాం’ పేరుతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో నటించే హీరో వివరాలను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. (APJ Abdul Kalam Biopic)

Also Read- Rana Naidu Season 2: బూతుల వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ నటుడు ధనుష్ (Dhanush) మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న ధనుష్, ఇప్పుడు ద లెజెండ్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లోనూ నటించనున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘కలాం’ (Kalam) అనే టైటిల్‌తో పాటు ‘ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ (Adipurush) వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.

Also Read- Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..

ఈ భారీ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, మరియు టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం యొక్క సిల్హౌట్‌తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని తెలియజేస్తుంది. ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యారు. ఇతర తారాగణం, సాంకేతిక బృంద వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటించబడనున్నారు. మరి ఈ సినిమాతోనైనా సౌత్ ప్రేక్షకుల ప్రేమను ఓం రౌత్ పొందుతారేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

Ward Member Dies: గెలిచిన రోజే వార్డు సభ్యుడి మృతి.. విషాద ఘటన

Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..

Chandrababu Naidu: కన్హా శాంతివనంలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఆశ్రమం సందర్శన