Rana Naidu Season 2 Poster Launch
ఎంటర్‌టైన్మెంట్

Rana Naidu Season 2: బూతుల వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

Rana Naidu Season 2: ‘రానా నాయుడు’ అనగానే అందరూ చెప్పే మాట బూతులు. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే విక్టరీ వెంకటేష్ ఇందులో బూతులు మాట్లాడటం, ఆయన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా తట్టుకోలేకపోయారు. అందుకే ఈ వెబ్ సిరీస్ సీజన్ 1పై భారీగా వ్యతిరేకత వ్యక్తమైంది. కొన్నాళ్ల పాటు ఓటీటీలో ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేశారు కూడా. అంత జరిగినా కూడా, ఈ వెబ్ సిరీస్ విశేష ఆదరణను రాబట్టుకుంది. అందుకే మేకర్స్ ఈ సిరీస్ సీజన్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 విడుదల ఎప్పుడు ఉంటుందో తెలుపుతూ హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రానా దగ్గబాటి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకకు బాలీవుడ్ వెర్సలైల్, డైనమిక్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ‘రానా నాయుడు సీజ‌న్‌2’ విడుదల తేదీకి సంబంధించిన భారీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. జూన్‌13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు’ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.

Also Read- Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..

ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సీజ‌న్ వ‌న్ కంటే సీజ‌న్‌2 మరింత వైల్డ్‌గా ఉంటుంది. ఈ సీజ‌న్ మ‌రింత పెద్ద‌దిగా, వ్య‌క్తిగ‌తంగా ఉంటుంది. ఈ సీజ‌న్‌2 కోసం మ‌రోసారి టీమ్‌ను క‌ల‌వ‌టం ఆనందంగా ఉంది. ఇందులోని పాత్ర‌లు మ‌రింత లోతుగా ఉంటాయి. అవ‌న్నీ గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. అన్ని విష‌యాల్లో హ‌ద్దుల‌ను మ‌రింత‌గా పెంచాం. ఇందులో ప్రేక్షకులు ఇష్ట‌ప‌డిన విష‌యాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాం. మొద‌టి సీజ‌న్‌కు అభిమానుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సీజ‌న్ ‌2కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను అభిమానుల స‌మ‌క్షంలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుద‌ల చేసినందుకు చాలా హ్యాపీ. నేను రానా నాయుడుగా న‌టిస్తే, ర‌వుఫ్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టించారు. ఇద్ద‌రం ఢీ అంటే ఢీ అనేలా న‌టించామని తెలిపారు.

Also Read- Oh Bhama Ayyo Rama: పెళ్లిపై అదిరిపోయే సాంగ్.. ఇక మోత మోగిపోతుందేమో!

అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. ఇందులో రవుఫ్ పాత్రకు జీవం పోయటం నాకు చాలా కష్టమైంది. అయితే కరణ్ అన్షుమన్ పట్టుదల, అంకితభావంతోనే అది సాధ్యమైందని చెప్పగలను. ఆయ‌న పాత్ర‌ల్లో అనేక వేరియేషన్స్ చూపిస్తూ చ‌క్క‌గా రాశారు. దీని వ‌ల్ల నా పాత్రను నేను ఈజీగా చేయగలిగాను. ఎలాంటి భ‌యం లేని రానా నాయుడుకి ఈ సీజ‌న్‌లో మాత్రం చాలా క‌ష్టాలుంటాయి. పాత్ర ప‌రంగా నేను చాలా క‌ఠినంగా న‌టించిన‌ప్పటికీ, షూటింగ్ స‌మ‌యంలో నేను రానాతో బాగా క‌లిసిపోయాను. తను చాలా మంచి కోస్టార్. తనతో వర్క్ చేయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక వెంక‌టేష్ కూడా అలాంటి స‌రదా వ్య‌క్తే. సూప‌ర్ టాలెంటెడ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. నెట్‌ఫ్లిక్స్‌లో నేను చేసిన మొద‌టి సిరీస్ కావ‌టంతో దీనికోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సీజ‌న్ 2 గొప్ప‌గా రావ‌టానికి మేక‌ర్స్ ఎంత‌గానో ఇన్‌వాల్వ్ అయ్యారు. ఔట్‌పుట్ చాలా మంచిగా వచ్చింది. క‌ర‌ణ్‌, సుప‌ర్ణ్‌, అభ‌య్.. ఇలా ముగ్గురు ద‌ర్శ‌కుల‌తో ఒకేసారి వర్క్ చేయ‌టం నాకు కూడా ఇది ఫస్ట్ టైమ్. జూన్‌13కు ఎంతో స‌మ‌యం లేదు కాబట్టి వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ను ట్యూన్ చేసుకోండని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు