Allu Arjun and Atlee
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్ చిత్రాల తర్వాత చేయబోయే సినిమాపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ ఉత్కంఠకు ఇటీవలే బ్రేక్ పడింది. వాస్తవానికి తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కన్ఫర్మ్ అయింది. కానీ ఆ సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Director Atlee)తో అల్లు అర్జున్ సినిమా ఓకే అయింది. రీసెంట్‌గా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అట్లీ మొదటి డైరెక్ట్ తెలుగు సినిమాగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్‌, హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌, దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియోతో ఈ చిత్రాన్ని రీసెంట్‌గా అధికారికంగా ప్రకటించారు.

Also Read- Yash Mother Pushpa: యష్‌తో నేను సినిమాలు చేయను.. ఎందుకంటే?

ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి, రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ డబుల్ రోల్ చేస్తున్నాడని ఒకసారి, కాదు కాదు త్రిబుల్ రోల్ అని మరోసారి, సూపర్ హీరో రోల్ అని ఇలా ఏదో రకంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్సే ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ఫుల్‌ స్వింగ్‌లో ఉండగా.. అందులో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అట్లీ హైదరాబాద్‌లో ఐకాన్‌స్టార్‌ను కలిసి ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా కూడా అప్డేట్ వచ్చింది. అంతే, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మధ్య చాలా సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రెగ్యులర్ షూట్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చిందో.. అల్లు అర్జున్ పేరును సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Also Read- Vishal Marriage: రజనీకాంత్ కుమార్తెతో హీరో విశాల్ పెళ్లి? అది దా సర్‌ప్రైజ్!

ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకంటే.. ప్రస్తుతం ప్రాజెక్ట్ AA22 x A6గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్, భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగించేలా రూపొందించనున్న ఈ సినిమా ఎమోషన్స్, మాస్ యాక్షన్, భారీ స్కేలు నిర్మాణంతో ఓ చారిత్రక సినిమాగా నిలవనుందని చెప్పబడుతోంది. సినిమాకు సంబంధించి విడుదలైన ప్రత్యేక వీడియో చూసిన వారంతా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో ఓ మ్యాజిక్‌ జరగబోతుందని, ఈ చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌ ఉండబోతుందనే క్లారిటీకి వచ్చేశారు. సంచలన దర్శకుడు అట్లీ తొలిసారిగా తెలుగులో రూపొందిస్తున్న అంతర్ధాతీయ పాన్‌ ఇండియా సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీ వంటి వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు