Etela Rajender: నువ్వు మమల్ని బెదిరిస్తే భయపడం.. కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉంది.. నీ చిట్టా అంతా తమ చేతిలో ఉంది.. నీ దిక్కుమాలిన చిల్లర గాళ్ళతో మాట్లాడిస్తే తాను వెనక్కి పోను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని శామీర్ పేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో దేవరాయాంజాల్ భూముల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పే.. నేడు నువ్వు చేస్తున్నావంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు వంద శాతం హాజరవుతానని స్పష్టం చేశారు. తనకు నోటీసులు పంపిన విషయం పేపర్లు, ఛానెల్స్ లో చూశానని చెప్పారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!
తనకు నోటీసులు అందిన అనంతరం పార్టీలో చర్చించి అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా తాను ముందుకు వెళ్తానన్నారు. ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి ఎలాంటి విచారణ అయినా చేయి అంటూ సవాల్ చేశారు. ఎలాంటి విచారణ చేసుకున్న తనకు అభ్యంతరం లేదన్నారు. నీ దిక్కుమాలిన చిల్లర గాళ్ళతో మాట్లాడిస్తే నేను వెనక్కి పోను స్పష్టం చేశారు.
Also Read: Rajiv Gandhi Death Anniversary: రాజీవ్ గాంధీ చొరవతోనే.. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు!