Yash Mother Pushpa: రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) పరిచయం అక్కరలేని పేరు. ‘కెజియఫ్’ (KGF) సిరీస్ చిత్రాలతో ఆయన ప్రపంచానికి పరిచయమయ్యారు. ఇప్పుడాయన మదర్ పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా మారి.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి పీఏ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ల స్ఫూర్తితో కొత్త బ్యానర్‌ను స్థాపించినట్లుగా చెప్పుకొచ్చిన ఆమె.. కొత్తవారికి అవకాశం ఇవ్వటానికే నిర్మాతగా మారుతున్నానని పుష్ప అరుణ్‌కుమార్ తెలిపారు.
ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా ‘కొత్తలవాడి’ (Kothalavadi Movie) అనే చిత్రాన్ని ఆమె రూపొందిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సిరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందుతోంది. గత నెలలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇప్పుడీ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేలా, మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
Also Read- MM Keeravani: పవన్ కళ్యాణ్‌పై కీరవాణి సంచలన వ్యాఖ్యలు
ఈ టీజర్‌ను గమనిస్తే.. సినిమా పాత్రల్లోని వైవిధ్యాన్ని తెలియజేసేలా ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ విజువల్స్, అభినందన్ కశ్యప్ కంపోజ్ చేసిన పవర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనేలా ఉన్నాయి. హీరో పృథ్వీ అంబర్ రగ్డ్, ఎనర్జిటిక్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. 90 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తోంది. రూటెడ్, పవర్‌ఫుల్ కథతో ఈ సినిమాను డైరెక్టర్ సిరాజ్ తీసుకురాబోతున్నారనే విషయం ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
‘కొత్తలవాడి’ అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో ఉన్న ఒక గ్రామం పేరు. అందుకనే ఇక్కడ చిత్రం ఎక్కువ భాగాన్ని చిత్రీకరించారు. సినిమా కథకు సంబంధించిన స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా బృందం స్థానిక యాసను కూడా ఈ సినిమాలో ఉపయోగించారు. గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read- Actor Sumanth: ఆమె వచ్చి అడిగితే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్న సుమంత్.. పెళ్లి గురించేనా?
టీజర్ విడుదల సందర్భంగా యష్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న నిర్మాత పుష్ప అరుణ్‌కుమార్‌కు ఎదురైంది. అందుకామె సమాధానమిస్తూ.. ‘‘నేను యష్‌తో సినిమా చేయను. ఎందుకంటే, వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. వాడే చేసుకోగలడు. వేరే వాళ్లతోనే సినిమాలు చేస్తాను. అన్నం ఉన్న వాడికి అన్నం పెడితే ఆ విలువ తెలియదు, లేనివాడికి పెడితేనే కదా విలువ తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి నేనేంటి పెట్టేది. ఆకలితో ఉన్నవాడికి పెడితే.. ఎప్పటికీ గుర్తుండి పోతుంది. తెలుగు వాళ్లు కన్నడ వాళ్లకు, కన్నడవాళ్లు తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రా కంటెంట్‌తో తెరకెక్కుతోన్న ‘కొత్తలవాడి’ చిత్రంలో భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. అలాగే ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. కచ్చితంగా ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని యష్ మదర్ పుష్ప అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు