Govt Whip Beerla Ilaiah: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం పోవడంతో కేటీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి గురించి అవాక్కులు చావాక్కులు పేలుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటిఆర్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని ఐలయ్య సూచించారు. మరోమారు సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితో నోటిని యాసిడ్ తో కడుగుతాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు అహర్నిశలు కష్టపడపడుతున్నారని బీర్ల ఐలయ్య తెలిపారు. తెలంగాణలో తాగు, సాగు నీటి ప్రాజెక్ట్ లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చి రోడ్లు నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలి.. కులేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం లేకపోయినా రికార్డ్ స్థాయిలో ఈసారి పంట పండిందని ఐలయ్య అన్నారు. అది మీ కళ్ళకు కనిపించడం లేదా? అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.
తీరు మార్చుకోకపోతే కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడుగుతాం : బీర్ల ఐలయ్య
కేటీఆర్ కు పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతున్నారు. కమిషన్ దందా, లిక్కర్ దందా, కాళేశ్వరం దందా ఇలా అన్ని దందాలు చేసిందే బీఆర్ఎస్.
ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య pic.twitter.com/PxQ1dDLTjp— ChotaNews App (@ChotaNewsApp) May 21, 2025
కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులను తమ సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని బీర్ల ఐలయ్య చెప్పారు. స్కామ్ ల చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని దుయ్యబట్టారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.