Irrigation project works: ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులతో కలిసి ధర్మారెడ్డి పల్లి కెనాల్ , పిలాయిపల్లి కెనాల్ , బునాదిగాని కెనాల్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Aslo Rerad: Congress Women Wing: కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్ లో చీలికలు.. గాంధీభవన్ సాక్షిగా ఫైట్!
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరంతంరం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, పనులను త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. కాంట్రాక్టర్లు పనులలో వేగం పెంచాలని, నిర్ణిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రానున్నది వర్షాకాలం కావడంతో రైతులు ఆందోళలో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి, బునాదిగాని కెనాల్స్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరం చేసుకుంటూ వర్క్స్ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందించే విధంగా అధికారులు పని చేయాలని , కాలువల పైన ఉన్న అక్రమ మోటర్లను తొలగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ , బీర్లా ఐలయ్య , మందుల శామ్యూల్ , ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read; Thummala Nageswara: పదేళ్లుగా అపెక్స్’ ఆడిట్ ఎందుకు చేయలేదు.. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం!