Coronavirus Cases (imagecredit:swetcha)
తెలంగాణ

Coronavirus Cases: కరోనాతో ఎలాంటి టెన్షన్ లేదు.. డాక్టర్ రవీంద్రనాయక్!

Coronavirus Cases: ఇతర దేశాలతో పాటు భారత దేశంలోనూ కొవిడ్ కేసులు స్వల్పంగా నమోదవుతున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో మళ్లీ కరోనా భయం మొదలైంది. కానీ కరోనాతో ఎలాంటి టెన్షన్ లేదని, మన స్టేట్ కు ముప్పు లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ క్లారిటీ ఇచ్చారు. ప్రజలంతా భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. సాధారణ ప్లూ తరహాలోనే వచ్చి పోతుందన్నారు. ఇది కామన్ వైరస్ అంటూ వివరించారు. అవసరమైన ఆందోళనతో గందరగోళానికి గురికావొద్దని ఆయన స్పష్టం చేశారు. అయితే కరోనా కేసులు పెరిగితే ఏం చేయాలి? దాని తీవ్రత ఏ మేరకు ఉంటుంది? కేసులు పెరిగితే కంట్రోల్ అవుతుందా? వైద్యారోగ్యశాఖ ప్రిపరేషన్లు ఎలా ఉన్నాయి? యాక్షన్ ప్లాన్ ఏమిటీ? వంటి తదితర అంశాలపై ఆయనతో స్వేచ్ఛతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.

Also Read: Kakatiya – Kamal Chandra Bhanj: ఓరుగల్లులో కాకతీయ వారసుని సందడి.. నేను రాజును కాను ఒక సేవకున్ని!

స్వేచ్ఛ: కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయా? ఓ సినీ నటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది నిజమేనా?
డైరెక్టర్: ప్రస్తుతానికి మన స్టేట్ లో అధికారికంగా కరోనా కేసు నమోదు కాలేదు. సోషల్ మీడియాలోనే సినీ నటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అది నిజమైనా భయపడాల్సిన అవసరం లేదు. వెరీ లెట్.

స్వేచ్ఛ: ఇతర దేశాలతో పాటు, రాష్ట్రాల్లోనూ స్వల్పంగా కేసులు తేలుతున్నాయి. మన స్టేట్ రాదని భావిస్తున్నారా?
డైరెక్టర్: భారతదేశంలో ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. కొంత వ్యాప్తి జరుగుతుండవచ్చు. దీనిలో భాగంగా మన స్టేట్ కూ రావచ్చు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ తరహాలో ప్రభావం ఉండదు. సాధారణ దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి తీవ్రతోనే తగ్గిపోతాయి. ప్రాణాపాయ పరిస్థితులు రానే రావు. సోషల్ మీడియాల్లో చూసి ప్రజలు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదు.

స్వేచ్ఛ: సడన్ గా కేసులు పెరిగితే పరిస్థితి ఏమిటీ?
డైరెక్టర్: సడన్ గా కేసులు పెరగడం అంటూ ఏమీ ఉండదు. వైరస్ తీవ్రతను కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు అంచనా వేసి అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తుంది. దాని ప్రకారమే అన్ని రాష్ట్రాలు నడుచుకుంటాయి. మన స్టేట్ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రం నుంచి సీరియస్ అంటూ ఎలాంటి గైడ్ లెన్స్ రాలేదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇండికేషన్స్ వచ్చాయి. దీంతో తాము కూడా స్టేట్ నుంచి అన్ని జిల్లా అధికారులకు అలర్ట్ ఇచ్చాం అంతే. వీక్లీ వీక్లీ రిపోర్టలపై వైరస్ తీవ్రతను అంచనా వేసి టెక్నాలజీ ఉన్నది.

స్వేచ్ఛ: ఇతర దేశాల్లోని కేసులపై స్డడీ జరిగిందా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది.?
డైరెక్టర్: ఇతర దేశాలతో పాటు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు కూడా అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమ్స్ తోనే వచ్చాయి. అసింప్టమాటిక్(ఎలాంటి లక్షణాలు లేని వారికి) కేసులకు మందులు వేసుకోకపోయినా, ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నోళ్లు ఆయా లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు మందులు వేసుకుంటే నయం అవుతుంది.

స్వేచ్ఛ: క్వారంటైన్, కంటైన్ మెంట్ పరిస్థితులను మళ్లీ చూడాలా?
డైరెక్టర్: నో నో అలాంటి ఛాన్సే లేదు. కానీ లక్షణాలు ఉన్నోళ్లు కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మాస్క్ వంటివి ధరిస్తే మేలు. ఇక కరోనా కేసు తేలగానే గతంలో ఆ చుట్టు పక్కాల వంద మీటర్ల పరిధిలో కంటైన్ మెంట్ విధించే వాళ్లం. కానీ ఆ పరిస్థితులు కానరావు.

స్వేచ్ఛ: అప్పుడప్పుడు కేసులు ఎందుకు తేలుతున్నాయి? శాశ్వత పరిష్కారం లేదా?
డైరెక్టర్: 2019 లో మొదలైన కరోనా ప్యాండమిక్ గా ఎదురుదాడి చేసింది. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత ఎండమిక్ స్టేజ్ కు వచ్చింది. పాండమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపిస్తుంది. కానీ ఎండిమిక్ స్టేజ్ లో ఆ పరిస్థితి ఉండదు. కానీ ఎక్కువ కాలం పాటు దాని అనవాళ్లు ఉండే అవకాశం ఉన్నది. వైరస్ మ్యూటేషన్(జన్యుమార్పిడి) జరగడమే దీనికి కారణం. కానీ మనిషి శరీరంపై సివియర్ గా ప్రభావం చూపించవు.

స్వేచ్ఛ: ఆసుపత్రుల్లో మళ్లీ కరోనా టెస్టులు చేస్తారా?
డైరెక్టర్: ఆ స్థాయిలో ఇంకా ప్రభావం లేదు. రాదనుకుంటున్నా కానీ అనుమానిత కేసుల్లో డాక్టర్ తగిన నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబు ఉన్నోళ్లలో కొందరికి కరోనా టెస్టు చేసినా పాజిటివ్ తేలుతుంది. దీంతో గాబర పడాల్సిన అవసరం లేదు. లక్షణాలకు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. టెస్టులు చేయాలని పబ్లిక్ హెల్త్ నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం.

స్వేచ్ఛ: ట్రీట్మెంట్ కు ఎలా సన్నద్ధమవుతున్నారు?
డైరెక్టర్: ఆసుపత్రుల వరకు కేసులు చేరే ఛాన్స్ లేనే లేదు. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే అనుభవం ప్యాండమిక్ పీరియడ్ 2019 నుంచి 2022 లో నేర్చుకున్నాం కరోనాను ఈజీగా హ్యాండిల్ చేసే శక్తి మన వైద్యారోగ్యశాఖ సిబ్బంది సొంతం చేసుకున్నారు. గతంలోనే ఏర్పాటు చేసుకున్న బెడ్లు, ఆక్సిజన్, స్టాఫ్​ అంతా ఫర్ ఫెక్ట్ గా ఉన్నది.

స్వేచ్ఛ: రోగ నిరోధక శక్తి ఏ మేరకు కంట్రోల్ చేస్తుంది?
డైరెక్టర్: ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తి ఉండటం సహజం. కానీ ఆయా శరీర పరిస్థితులను బట్టి హెచ్చు థగ్గులు ఉంటాయి. కరోనా నియంత్రణలో భాగంగా మన స్టేట్ లో గతంలోనే వ్యాక్సినేషన్ జరిగింది. దీంతో యాంటీబాడీస్ ఉత్పత్తి ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ దాడి చేయాలని ప్రయత్నించినా వాటిని ఎదుర్కొనేందుకు శరీరంలో ఏర్పడిన యాంటీబాడీస్ ఎటాక్ చేస్తాయి. కానీ గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు కాస్త అప్రమత్తంగా ఉంటే బెటర్. ఈ గ్రూప్ లో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా ఉంటుంది.

స్వేచ్ఛ: ప్రజలకు మీరెచ్చే సలహాలు, సూచనలు ఏమిటీ?
డైరెక్టర్: వీలైనంత వరకు జన సామూహికలు(గ్రూప్ గేదరింగ్స్) కు దూరంగా ఉంటే బెటర్. పెళ్లిళ్లు, పంక్షన్లు, పార్టీల్లో తగినన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు, జలుబు, వంటి లక్షణాలు ఉంటే తగ్గే వరకు మాస్క్ ధరించాలి. ఇమ్యూనిటీ పెరిగే శక్తి వంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ లక్షణాలు తేలగానే టెస్టుల కోసం పరుగులు పెట్టవద్దు. సాధారణ సింప్టమాటిక్ మందులు వాడితే సరిపోతుంది.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి కీలక ఆదేశాలు.. రంగంలోకి కమిటీ!

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..