MLC Addanki Dayakar: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్టాడుతూ.. అవినీతి చేసిన విరిని వెలికితీసే ఉద్దేశ్యంతోనే కమిషన్ జరుగుతుందని.. రాజకీయ కక్షతో కాదని పేర్కొన్నారు.
కాళేశ్వరంలో తప్పు జరిగిందని కమిషన్ తేల్చిందని, ఒకవేళ వారు తప్పు చేయకుంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్, ఈటెల, హరీష్ రావు లకు నోటీసులు ఇవ్వడం ముఖ్యమైన పరిణామమని అద్దంకి దయాకర్ తెలిపారు. విచారణ చేస్తున్న కమిషన్ శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.
YS Jagan Warning: వచ్చేది మన ప్రభుత్వమే.. ఇక వారికి సినిమానే.. జగన్ వార్నింగ్
ప్రభాకర్ రావు వెళ్లినట్టు కేసీఆర్ కూడా అమెరికా పారిపోవాలని చూస్తున్నారని తీవ్ర విమర్శలు చేసారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ వాటర్ లిఫ్ట్ చేయడానికి కాకుండా క్యాష్ లిఫ్టింగ్ కి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చారని మండిపడ్డారు. నోటీసులపై బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలు చేస్తుండటంతో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈటెలను కావాలనే కేసీఆర్ బీజేపీలోకి పంపించారా? అని ధ్వజమెత్తారు.
అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే పార్టీ మారారని అనుమానాలు ఉన్నాయని.. దీనిపైన వివరణ ఇవ్వాలన్నారు. సీల్డ్ కవర్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారని కాళేశ్వరం లో తాను విచారణ ఎదుర్కోవలసి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని ని దేశ ద్రోహి అంటారా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు.
Also read: Kakatiya – Kamal Chandra Bhanj: ఓరుగల్లులో కాకతీయ వారసుని సందడి.. నేను రాజును కాను ఒక సేవకున్ని!
సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ట్రంప్ ప్రకటన పై ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా.. ఎన్ని విమానాలు కూల్చారు అని అడిగితే దేశ ద్రోహి అంటూ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబం గురించి మీరు మాట్లాడతారా అని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఎవరైనా స్వాతంత్రోద్యమంలో పాల్లొన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిచారు. కిషన్ రెడ్డి లాంటి బానిసలతోనే దేశానికి నష్టం అని ఘాటు వ్యాఖ్యలు చేసారు.