Shhyamali De Post
ఎంటర్‌టైన్మెంట్

Samantha and Raj: రాజ్ నిడిమోరు మాజీ భార్య మరో సంచలన పోస్ట్!

Samantha and Raj: స్టార్ హీరోయిన్ సమంత రెండో మ్యారేజ్‌కు సంబంధించి వార్తలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో.. సోషల్ మీడియా పాలో అయ్యేవారికి, లేదంటే ఇంటర్నెట్‌పై కూసంత అవగాహన ఉన్నవాళ్లకి ఇట్టే తెలిసిపోతుంది. అందుకే, నిత్యం ఏదో ఒక టైమ్‌లో సమంత పేరు ట్రెండింగ్‌లోకి వస్తుంది. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత కొన్నాళ్ల పాటు నటనకు దూరంగా ఉంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, దాని చికిత్స నిమిత్తం ఫారెన్ వెళుతున్నానని చెప్పి సుమారు 6 నెలల పాటు నటనకు దూరంగా ఉంది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సమంత, వరుసగా సినిమాలేం చేయడం లేదులే కానీ, వెబ్ సిరీస్‌లలో మాత్రం చేసేందుకు ఓకే చెబుతుంది. అదీ కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చేసిన దర్శకద్వయం రాజ్, డీకేలతో చేయడానికే ఆమె ఆసక్తి కనబరుస్తోంది.

Also Read- Vishal Marriage: రజనీకాంత్ కుమార్తెతో హీరో విశాల్ పెళ్లి? అది దా సర్‌ప్రైజ్!

ఆ దర్శకద్వయంలోని రాజ్ నిడిమోరుతో ప్రస్తుతం ఆమె డేటింగ్ చేస్తుందని, వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్యాప్‌లో రాజ్‌తో సమంత కనిపించే తీరు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ వస్తుంది. వారిద్దరి గురించి తెలిసిన వారు, పబ్లిగ్గానే ‘శతమానం భవతి’ అంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు. మరి వారిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ, నిత్యం ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజ్ నిడిమోరు మాజీ భార్య సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా.. అది రాజ్, సమంతలను ఉద్దేశించే అనేలా టాక్ మొదలైంది. ఆమె పోస్ట్‌లు అర్థం కాకపోయినా, వాటిపై భారీగా చర్చలు నడుస్తున్నాయి. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి (Shhyamali) వాస్తవానికి ఈ మధ్యే సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అంతకు ముందు ఆమె ఇలా పోస్ట్‌లు పెట్టిన దాఖలాలు లేవు. దీంతో ఆమె వీరిద్దరినే టార్గెట్ చేస్తుందనేది ఆ చర్చలలోని సారాంశం.

Also Read- Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్‌పై కీలక అప్డేట్!

రీసెంట్‌గా.. ‘నా గురించి మాట్లాడేవారికి, నా తరఫున మాట్లాడేవారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి రాసే వారికి, నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేసిన శ్యామలి.. తాజాగా మరో పోస్ట్‌తో వార్తలలో హైలైట్ అవుతోంది. ‘మంచి కర్మను సృష్టించండి. ప్రజలకు సాయం చేయండి. నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి’ అంటూ ఆమె చేసిన తాజా పోస్ట్ కచ్చితంగా సామ్, రాజ్‌లకు కౌంటరే అన్నట్లుగా అంతా భావిస్తున్నారు. అంటే వారి కారణంగా తన జీవితం నాశనం అవుతుందనో, లేదంటే తనకు అన్యాయం జరుగుతుందనేది చెప్పడానికి శ్యామలి ఈ దారిని ఎంచుకుందనేలా ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?