Task force officers (imagecredit:twitter)
తెలంగాణ

Task force officers: గాడితప్పుతున్న టాస్క్ ఫోర్స్.. సంచలన కేసుల్లో కనిపించని ముద్ర!

Task force officers: టాస్క్​ ఫోర్స్​ఈ పేరు వింటేనే ఇంతకు ముందు సంఘవిద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఇప్పుడు రైళ్లు కాదు సైకిల్లు కూడా పరుగెత్తుత లేవు. కారణం దీని పని తీరు నానాటికి తీసికట్టు నాగంబొట్టూ అన్నట్టుగా తయారు కావటమే. గతంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్లో మిస్టరీని ఛేదించి అసాంఘిక శక్తుల పాలిట సింహ స్వప్నంగా నిలిచినా టాస్క్​ఫోర్స్ కొంతకాలంగా చిన్నాచితకా కేసులతోనే సరి పెడుతోంది. దీనికి కారణం టాస్క్​ఫోర్స్​బృందాల్లో పని చేస్తున్న వారిలో కొందరు ఆమ్యామ్యాలకు అలవాటు పడటమే అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దానికి తోడు అధికారులు పటిష్టమైన ఇన్ఫార్మర్ నెట్​ వర్క్​ వ్యవస్థ లేకుండా పోవటమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలీస్​కమిషనర్​గా పున్నయ్య

1982వ సంవత్సరానికి ముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి ఆట కట్టించేందుకు హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్ లో యాంటీ గూండా స్క్వాడ్ పని చేసేది. అయితే, నేరాలు పెరిగి పోతుండటం నేరాలు జరుగుతున్న తీరులో మార్పులు రావటంతో వీటికి చెక్​పెట్టేందుకు పోలీస్​కమిషనర్​గా పున్నయ్య ఉన్న సమయంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఆయా డీసీపీ జోన్ల వారీగా టాస్క్​ ఫోర్స్ బృందాలు పని చేసేవి. ప్రస్తుతం హైదరాబాద్​కమిషనరేట్ పరిధిలో ఏడు డీసీపీ జోన్లు ఉండగా ఆయా జోన్లకు అనుబంధంగా టాస్క్​ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయి.

ఇక, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టయితే పక్కగా సమాచారాన్ని సేకరించటం దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేయటం టాస్క్​ ఫోర్స్​ విధుల్లో ప్రధానమైంది. దాంతోపాటు సంచలనం సృష్టించే హత్యలు, దోపిడీలు, బందిపోటు దోపిడీలు, ఎక్స్​టార్షన్లు, కిడ్నాపులు, భూ కబ్జాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలను కూడా అరికట్టాల్సి ఉంటుంది.దాంతోపాటు రౌడీషీటర్లు కమ్యూనల్​రౌడీషీటర్లు, ఉగ్రవాద సానుభూతి పరులు, గతంలో టెర్రరిస్ట్​ కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారిపై నిరంతర నిఘా పెట్టాల్సి ఉంటుంది. గతంలో టాస్క్ ఫోర్స్​ బృందాలు ఈ దిశలో ఘనమైన విజయాలనే సాధించారు. ఎన్నో సంచలన కేసుల్లో మిస్టరీని ఛేదించారు.

Also Read: Harish Rao: మద్యం ప్రియుల పక్షాన హరీష్ రావు.. రేవంత్ సర్కార్‌పై కొట్లాట!

కరడుకట్టిన నేరస్తులను కటకటాల వెనక్కి పంపించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన పలువురిని పట్టుకున్నారు. అయితే, రాను రాను టాస్క్​ఫోర్స్​బృందాల పని తీరు నామమాత్రంగా మారిపోయింది. కల్తీ సరుకులు, నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వారిని పట్టుకోవటం, చిన్న స్థాయిలో దందా చేస్తున్న గంజాయి పెడ్లర్లను అరెస్టులు చేస్తున్నారు తప్పితే సంచలనం సృష్టించిన కేసుల్లో వీరి పాత్ర పెద్దగా కనిపించటం లేదు.

అండర్ వరల్డ్​డాన్ అబూసలేంను అరెస్ట్

దీనిపై గతంలో రిటైరైన ఓ అధికారితో మాట్లాడగా తాము ఉన్నపుడు పటిష్టమైన ఇన్ఫార్మర్​వ్యవస్థ ఉండేదని చెప్పారు. నగరంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా సమాచారం వచ్చేదన్నారు. ఇక, అప్పట్లో టాస్క్ ఫోర్స్​ బృందాల్లో పని చేసిన సిబ్బంది కూడా అంకిత భావంతో విధులు నిర్వర్తించే వారన్నారు. ఈ క్రమంలో ఎన్నో సెన్సేషనల్​కేసులను సాల్వ్ చేశామన్నారు. హైదరాబాద్ లో వైన్​షాపుల యజమానులు, వాటిల్లో పని చేసే ఉద్యోగులను వరుసగా కాల్చి చంపుతూ దోపిడీలకు పాల్పడ్డ గ్యాంగును టాస్క్​ ఫోర్స్​పోలీసులే అరెస్టు చేశారన్నారు.

అండర్ వరల్డ్​డాన్ అబూసలేంను అరెస్ట్ చేసింది కూడా టాస్క్​ఫోర్స్ పోలీసులే అని చెప్పారు. పలువురు ఉగ్రవాదులు పట్టుబటంలో కూడా టాస్క్​ఫోర్స్​బృందాలు కీలకపాత్ర వహించాయన్నారు. అందుకే కక్షగట్టి ఉగ్రవాదులు 2‌‌005లో దసరా పండుగ రోజున టాస్క్ ఫోర్స్​ఆఫీస్ పై ఆత్మాహుతి దాడి జరిపారని చెప్పారు. ఇలా చెబితే వందల ఉదంతాలు ఉంటాయన్నారు.

ప్రస్తుత టాస్క్​ ఫోర్స్​ బృందాల పనితీరు విషయానికి వస్తే అసాంఘిక శక్తుల ఆట కట్టించాల్సిన సిబ్బందిలో కొందరు వారితో జతకడుతుండటమే వాటి పని తీరు దిగజారి పోతుండటానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. కాస్త కరడుకట్టిన ఏ రౌడీషీటర్​మొబైల్​ఫోన్ చెక్​చేసినా టాస్క్​ఫోర్స్ సిబ్బంది సెల్​నెంబర్లు ఖచ్చితంగా దొరుకుతాయన్నారు. నిజం చెప్పాలంటే ఎక్కడెక్కడ అక్రమ దందాలు జరుగుతున్నాయన్న దాంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం టాస్క్​ఫోర్స్​వద్ద ఉంటుందన్నారు.

Also Read: Sangareddy District: ఆపరేషన్ ఘోస్ట్ సిమ్.. సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం..

అయితే, పై సంపాదనలకు అలవాటుపడ్డ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతుండటంతో వాళ్లు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోందన్నారు. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఎన్నో కేసులను టాస్క్​ ఫోర్స్ పరిష్కరించిందని ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా పరిష్కరించ లేకపోవటానికి ఇదే కారణమన్నారు. కాస్త సెన్సేషన్​కేసు సాల్వ్​అయితే మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే పోలీస్​బాసులు కూడా టాస్క్​ఫోర్స్​బృందాల పని తీరును పెద్దగా పట్టించుకోక పోతుండటం కూడా ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు.

 

 

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!