Manoj Counters Vishnu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Manoj Counters Vishnu: శివయ్యా అని పిలిస్తే.. శివుడు రాడంటూ అన్న విష్ణుకు కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

Manoj Counters Vishnu: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి భైరవం అనే మూవీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మనోజ్ మాట్లాడిన మాటలు అందర్ని ఏడిపిస్తున్నాయి. భైరవం మూవీ గురించి మాట్లాడుతూ ఇటీవలే తన ఇంట్లో జరిగిన గొడవల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతే కాదు, అన్న విష్ణు మీద కూడా స్ట్రాంగ్ గా కౌంటర్లు వేశాడు.

” తొమ్మిదేళ్ల తర్వాత కొత్త మూవీతో వస్తున్నాను.. కరోనా వచ్చి వెళ్లిపోయింది.. అప్పుడు చేయాలనుకున్న ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.. మనం అనుకున్నవన్ని ఏం జరగవు.. ఏదో అనుకుంటాం.. ఇంకేదో జరుగుతుంది.. అలాగే మనం ఒకటి చేయాలనుకుంటే .. దేవుడు ఇంకేదో చేస్తాడు.. ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా మీ ప్రేమ మాత్రం అలాగే ఉంది. సినిమాలు చేయకపోతే పట్టించుకోని మీరు.. 9 ఏళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను.. ఇప్పటికీ కూడా మీరు అలాగే ప్రేమిస్తున్నారని అని అన్నారు. మంచు మనోజ్ ఇంకా మాట్లాడుతూ ” శివయ్యా అని పిలిస్తే ఆ శివుడు రాడు.. మనసులో తలుచుకుంటే.. వస్తాడంటూ ” అన్న విష్ణుకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు.

దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ మధ్యలో శివుడిని లాగకండి. మీ గొడవల్లో దేవుడి పేర్లు ఎందుకు తలవడం ఏంటని కొందరు మండి పడుతున్నారు. ఇంకొందరు.. నీకెందుకు అన్నా మేము ఉన్నాము కదా .. మీరు సినిమాలు తీయండి.. మేము సపోర్ట్ చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు