CM Revanth Reddy: రైతులకు అండగా.. సీఎం
CM Revanth Reddy(image credit:X)
Telangana News

CM Revanth Reddy: రైతులకు అండగా.. ఇందిరా సౌర గిరి జల వికాసం..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకొని బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు.

కార్యక్రమం అనంతరం స్వగ్రామం కొండారెడ్డి పల్లెకు చేరుకొని, అక్కడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని సీఎంవో వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఇదిలా ఉండగా, రూ. 12,600 కోట్ల బడ్జెట్ తో ఇందిర సౌర గిరి జల వికాసాన్ని అమలు చేయనున్నారు. ఒక్కొ యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందజేయనున్నారు.

Also read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్ .. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు?

తెలంగాణ ప్రభుత్వం ఆర్ వోఎఫ్​ ఆర్ చట్టం 2006 ప్రకారం 2,30,735 మంది గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించి 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ భూమిపై యాజమాన్యపు హక్కులు కల్పించారు. ఆ భూ ఉత్పాదకత ద్వారా ఆర్ధికంగా మెరుగుపడాలని, జీవనోపాధి పెరుగుతుందని ప్రభుత్వం ఆలోచన.

అయితే భూ హక్కులు కల్పించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ ఆర్ వోఎఫ్​ ఆర్ భూముల అభివృద్ధికి కృషి చేయలేదని ఈ ప్రభుత్వం చెప్తుంది. దీంతోనే సీఎం ఆదేశాల మేరకు వంద శాతం గ్రాంట్ తో సోలార్ పంపు సెట్లను పంపిణీ చేసి, ఆతర్వాత బిందు సేద్యంతో ఉద్యానవన తోటలు పెంచవచ్చేది సర్కార్ భావన.

తద్వారా గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరునన్నది.2025–26 నుంచి 2029–2030 వరకు ఐదు సంవత్సరాల పాటు సబ్సిడీ ప్రాతిపాదికన, సంతృప్త పద్ధతిలో ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఇక రైతుకు మినిమం రెండున్నర ఎకరాలు కలిగి ఉంటేనే ఈ స్కీమ్ కు అర్హులు.

ఐదేళ్ల ప్లాన్ ఇలా..
సంవత్సరం ఎస్టీ రైతుల సంఖ్య విస్తీర్ణం(ఎకరాల్లో) బడ్జెట్(కోట్లలో)
2025–26 10వేలు 27,184 600
2026–27 50వేలు 1,43,204 3000
2027–28 50వేలు 1,43,204 3000
2028–29 50వేలు 1,43,204 3000
2029–30 50వేలు 1,43,204 3000

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..