Naveen Chandra
ఎంటర్‌టైన్మెంట్

Naveen Chandra: నవీన్ చంద్ర రేంజ్ పెరిగింది.. ఒక్కరు కాదు, ఇద్దరితో ‘కరాలి’!

Naveen Chandra: నవీన్ చంద్ర పేరు ఈ మధ్య ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘లెవన్’ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే, ఆయన నటించబోయే మరో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఇప్పటి వరకు విలన్‌గా, లేదంటే ఒక హీరోయిన్‌తో కలిసి హీరోగా, లేదంటే ఇద్దరు హీరోలు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించే పాత్రలలో నటిస్తూ వస్తున్న నవీన్ చంద్రకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చేసింది. ఆ ప్రమోషన్ ఏమిటంటే.. తాజాగా ప్రారంభోత్సవం జరుపుకున్న సినిమాలో ఆయన సరసన ఒక్కరు కాదు.. ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Vasudeva Sutham: మైథలాజికల్ టచ్‌తో మాస్టర్ మహేంద్రన్ అరాచకం

శ్రీమ‌తి మంద‌ల‌పు ప్ర‌వ‌ల్లిక స‌మ‌ర్ప‌ణ‌లో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోహీరోయిన్లుగా మంద‌ల‌పు శివకృష్ణ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘కరాలి’ (Karaali). రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సాహు గార‌పాటి క్లాప్ కొట్ట‌గా, శ్రీహ‌ర్షిణి ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ అధినేత గోరంట్ల ర‌వికుమార్‌, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుమాటి న‌ర‌సింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు.

Karaali Opening
Karaali Opening

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో.. ఈ సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా చిత్రమిది. కాజల్ చౌదరి నటించిన ‘అనగనగా’ చిత్రం ఓటీటీలో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. రాశీ సింగ్ వరుస సినిమాలతో బిజీ నటిగా మారిపోయింది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇప్పటి వరకు నేను ఎలాంటి పాత్రలు చేసినా ప్రేక్షకులు, మీడియా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ మూవీ ప్రేక్షకులందరూ హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని చెప్పారు.

Also Read- Allu Aravind: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కుమారులని తెలుసా?

నన్ము నమ్మి అవకాశం ఇచ్చిన హీరో నవీన్ చంద్రకు, నిర్మాత శివకృష్ణకు ధన్యవాదాలని దర్శకుడు రాకేష్ చెప్పారు. ‘నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్ఎస్ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఈ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. రాకేష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నామని అన్నారు చిత్ర నిర్మాత మంద‌ల‌పు శివకృష్ణ. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?