Vasudeva Sutham: మాస్టర్ మహేంద్రన్ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, ఆహా, దేవి, సింహరాశి, సింహాద్రి’ వంటి సినిమాలలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మహేంద్రన్, ఇప్పుడు హీరోగా తన ప్రతిభను కనబరిచేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మైథలాజికల్ టచ్‌తో వస్తున్న చిత్రాలకు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో మైథలాజికల్ ఫిల్మ్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడలాంటి కథతో మాస్టర్ మహేంద్రన్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒక దేవాలయం చుట్టూ తిరిగే కథతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు మాస్టర్ మహేంద్రన్ (Master Mahendran) ‘వసుదేవ సుతం’ అనే చిత్రంతో బాక్సాఫీస్‌ని పలకరించబోతున్నాడు.
బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవ సుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మణిశర్మ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. కచ్చితంగా ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందనేది అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా విజువల్స్ అద్భుతం అనేలా ఉన్నాయి. ఒక్కసారి గ్లింప్స్‌ని గమనిస్తే..
విశ్వంలోంచి భూమిని రివీల్ చేసి, భూమిపై ఉన్న ఓ గుడి, ఆ గుడిలో ఉన్న దేవుడిని చూపిస్తూ.. ఆ దేవుడికి కాపలాగా భారీ సర్పం ఉన్నట్లుగా చూపించారు. ఆ తర్వాత అదుర్స్ అనే రేంజ్‌లో హీరో ఎంట్రీని ప్లాన్ చేశారు. ప్రతి షాట్‌లో దైవత్వం ఉట్టిపడేలా ఈ గ్లింప్స్‌ని కట్ చేసిన విధానం వావ్ అనేలా ఉంది. మొత్తంగా అయితే గుడిలోపల భారీ నిధి దాగి ఉందని, ఆ నిధి చుట్టూనే ఈ కథ తిరుగుతుందనేది ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తుంది. ఈ గ్లింప్స్‌తోనే సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. మరీ ముఖ్యంగా మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వావ్ అనేలా ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Also Read- Allu Aravind: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కుమారులని తెలుసా?
ఇక ఈ గ్లింప్స్‌ని వదిలిన మణిశర్మ.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఒక కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ గ్లింప్స్ విడుదల చేసిన మణిశర్మకు ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలుపుతామని మేకర్స్ ప్రకటించారు. మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్ వంటి వారంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు