Ponnam Prabhakar: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ అధికారుల పని తీరు ఇంకా మెరుగు పడాలని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలానికి ముందే హైదరాబాద్ నగరంలోని డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికలను సిద్దం చేయనున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు. సిటీలో ఎక్కడైనా చెత్త కనపడినా, వీధి లైట్లు వెలగకపోయినా బాధ్యుల పై చర్యలు తప్పవని, ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించని వారి పై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
మంత్రి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్, లైటింగ్, వ్యర్థ నిర్వహణ, పలు అభివృద్ది పనులతో పాటు ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గత సర్కారు హయాంలో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ఆర్ డీపీ) కింద చేపట్టిన పనుల్లో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఫలక్ నూమా ఆర్వోబీ పనులను జులై వరకు, శాస్త్రి పురం ఆర్వోబీ ఆగస్టు వరకు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు డెడ్ లైన్ లు విధించారు.
Also Read: Health Cards To Orphans: దేశంలోనే ఫస్ట్ టైమ్.. అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు!
శిల్పా లే అవుట్ రెండో దశ పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు విభాగం ఇంజనీర్లు మంత్రికి వివరించారు. హెచ్ సిటీ ద్వారా మంజూరైన పనులు యుద్ధ ప్రతిపాదన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. టెండర్ పక్రియ అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే పనులు చేపట్టాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. పూడిక తీత పనులు వెంటనే చేపట్టి, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వర్షాకాలంలో వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద నీటి నిలువ కుండా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ప్రధాన రోడ్డు మీద కాకుండా అంతర్గత రోడ్ల పైన కూడా నిలిచే అవకాశం ఉన్నందున, అక్కడ కూడా మొబైల్ స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో శానిటేషన్ పై దృష్టి సారించాలని, అవసరమైతే శానిటేషన్ వర్కర్ లను ఏర్పాటు చేయాలన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ పై భారం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ డంప్ యార్డు ఏర్పాటుకు స్థలాలు అవసరమని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ మంత్రిని కోరగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లకు త్రిబుల్ ఆర్ కు స్థల సేకరణ చేస్తున్న నేపథ్యంలో డంప్ యార్డు కోసం స్థల సేకరణ కు చర్యలు తీసుకోవాలని కోరిన లేఖ తనకు అందిస్తే ప్రభుత్వంతో చర్చించి, స్థలాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు.
Also Read: BRS Sliver Jublee Celebrations: అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవాలు.. డల్లాస్ నుంచి మొదలు!
స్ట్రీట్ లైట్ వచ్చిన పిర్యాదులను పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు, పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతున్నాఇక నుండి పిర్యాదులు రోజు వారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నటున్నట్లు అడిషనల్ కమిషనర్ మంత్రి కి వివరించారు. మధ్యాహ్నం పూట వీధి లైట్స్ వెలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్ట్రీట్ లైట్స్ మెయింటనెన్స్ కు సంబంధించి ఈఈఎస్ఎల్ తో చేసుకున్న ఒప్పందం గడువు పూర్తయిననందున, వారి సబ్ కాంట్రాక్టర్ లకు రెండు నెలల నిర్వహణ బాధ్యతలను పొడిగించామని వీధి లైట్స్, మరమ్మతుల కోసం సామాగ్రి కొనుగోలుకు జోనల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ ఆర్ వి కర్ణన్ మంత్రి కి వివరించారు.
స్ట్రాటెజికల్ నాలా డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ఎన్ డీపీ) పేజ్ -1లో చేపట్టిన చాలా పనులు 90 శాతం పూర్తి కాగా, ఈ పనులతో 150 కాలనీ ముంపు ప్రమాద నివారణ అయినట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. వర్షా కాలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నగరంలో సుందరీ కరణ పనుల పూర్తి చేయాలని స్లమ్ ఏరియాలో కూడా అవసరమైన ప్రదేశాలలో చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వీటి కోసం ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీకి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని వెల్లడించారు.
Also Read: Saraswati Pushkaralu:సరస్వతి పుష్కరాల్లో మంత్రి తుమ్మల సందర్శన.. అభివృద్ధి పనులపై సమీక్ష!
ఇంజనీరింగ్, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలపై సమీక్ష జరిపి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణ జనాభాలో సుమారు 30 శాతం మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నందున, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి, అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన జీవనం కల్పించే దిశగా అధికారులు ముందుకు సాగాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన సిబ్బందిని పెంచి, శానిటేషన్ కార్యకలాపాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే జీహెచ్ఎంసీ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్‌ను పారిశుధ్యం, మౌలిక సదుపాయాల పరంగా ముందంజలో ఉంచడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్.వి కర్ణన్, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు