Samantha: టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్స్ లో సమంత (Samantha Ruth Prabhu) ఒకరు. ప్రముఖ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకులు అనంతరం.. ఆమె బాలీవుడ్ (Bollywood) లో సెటిల్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్ హనీ బన్నీ’ వంటి సిరీస్ లు చేసింది. అయితే ఆ సిరీస్ ను డైరెక్ట్ చేసిన వారిలో ఒకరైన రాజ్ నిడిమోరు తో సామ్ లవ్ లో పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై సామ్ మేనేజర్ (Samantha Manager) తాజాగా క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత పీకల్లోతూ ప్రేమలో ఉందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని.. కొత్త ఇల్లు కూడా వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆలయాలకు సైతం జంటగా వారు తిరుగుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాలకు సామ్ మేనేజర్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Samantha Subham: ట్రా లా లా లక్ష్యమిదే.. సమంత కోరిక తీరుతుందా?
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందన్న ప్రచారాలను సామ్ మేనేజర్ ఖండించారు. ఆ వార్తలన్నీ కేవలం అసత్యాలేనని తేల్చిచెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు సామ్ – రాజ్ పెళ్లి చేసుకోబోవడం లేదని.. వారు కొత్త ఇంటి కోసం వెతకడం లేదని అన్నారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మేనేజర్ చెప్పిన మాటలకు.. రాజ్ తో సమంత క్లోజ్ తిరుగుతున్న చేతలకు అసలు సంబంధం లేదని కామెంట్స్ చేస్తున్నారు.