Minister Seethaka (imagecredit:twitter)
తెలంగాణ

Minister Seethaka: బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం.. వాస్తవాలు మాట్లాడే దమ్ము లేదా!

Minister Seethaka: గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్ళడం సంప్రదాయం.. అదే వేయిస్తంభాలగుడివద్ద పాటించారని, అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్ళ కు నీళ్ళు పోసిందని దానిని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బంధనం చేస్తున్నారని, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్స్ వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు.

హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని మండిపడ్డారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరిగిన నాయకుడి.. ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగితే అందరి కాళ్ళు కడిగించాలి కదా? దానిని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? అని నిలదీశారు. కవితమ్మ కాళ్ళ దగ్గర కలెక్టర్ ను కూర్చోబెట్టినప్పుడు.. కేసీఆర్ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం మీ దురహంకారం కదా? అని ప్రశ్నించారు. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారన్నారు.

Also Read: Boycott Turkey: నిన్న ఆపిల్.. నేడు మార్బుల్.. టర్కీకి మరో గట్టి షాక్!

తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా..? అని నిలదీశారు. తెలంగాణ పేరునే మీ పార్టీ పేరు లో నుంచి తీశారు కదా? ఈమధ్య సబితా ఇంద్రా రెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసు అన్నారు. వాస్తవాలు మాట్లాడు.. అబద్ధాలు కాదు.. ఇప్పటికైనా అబద్ధాలకు అంబాసిడర్ గా సబితమ్మ మారకు..? అని హితవు పలికారు. అధికారం పోయాక ప్రజలు, ఆత్మగౌరవం గుర్తుకు మీకు వచ్చిందా..? అని మండిపడ్డారు.

అంగన్వాడి కేంద్రాలను సిద్ధం చేయాలి

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పై డీడబ్ల్యూఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్‌వాడీ ల బలోపేతం పై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అమ్మ మాట అంగన్వాడి బాట నినాదంతో క్యాంపెయిన్ చేయాలన్నారు. ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దాలన్నారు. అంగన్వాడీల్లో ఫర్నిచర్, ఆట వస్తువులు, ప్రీ ప్రైమరీ విద్యను, యూనిఫాములను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.

మతం వేరు కాదు మానవత్వం వేరు కాదు

మతం వేరు కాదు మానవత్వం వేరు కాదని మంత్రి సీతక్క అన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశానికి హాజరై మాట్లాడారు. మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు అని సూచించారు. ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ.. సాటి మనిషిని ప్రేమించాలన్నారు. పౌర సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజం కోసం మన ప్రాణాలు ఇవ్వలేకపోయినా.. తోటి ప్రజల కోసం సేవ చేయాలని సూచించారు.

Also Read: Virat Kohli: కోహ్లీని బీసీసీఐ ఇబ్బంది పెట్టిందా? రిటైర్మెంట్ వెనక షాకింగ్ నిజాలు!

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?