Vachinavaadu Gautam Teaser: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, ప్రేక్షకులని అలరిస్తున్న హీరో అశ్విన్ బాబు (Ashwin Babu). ఇప్పుడాయన మరో ఎక్సయిటింగ్ మూవీతో రాబోతున్నారు. ఆ మూవీనే ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకుడు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొని పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి నిర్మాత ఆర్థిక సాయం అందించారు. ఇక ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే..
Also Read- Jayam Ravi: కెనీషాతో కలిసి ఉండటంపై వివరణ ఇస్తూ.. జయం రవి సంచలన లేఖ
‘18 పర్వాల భారతంలోనైనా, 12 స్కంధాల భాగవతంలోనైనా.. అవతారాలు పుట్టింది ధర్మ రక్షణ కోసమే. ఆ ధర్మం దారి తప్పినప్పుడు, ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్’ అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్.. మినీ కెజియఫ్‌ని తలపించింది. మొదటి ఫ్రేమ్ నుంచి టీజర్ పూర్తయ్యే వరకు ప్రతి షాట్ వావ్ అనేలా కట్టిపడేస్తుంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్‌గా మెస్మరైజ్ చేస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ అన్నీ ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్ కొత్తదనంతో నిండి ఉండగా.., ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో తీసుకువస్తున్నాడనేది ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ టీజర్‌లో ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, గౌర హరి అందించిన నేపథ్య సంగీతం అన్నీ కూడా టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తుందని నిరూపిస్తున్నాయి. ఈ టీజర్ తర్వాత సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోతున్నాయి.
టీజర్ లాంచ్ అనంతరం ‘హిట్’ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. టీజర్ కట్ అదిరింది. అశ్విన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. తనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. నిర్మాత గణపతి పాజిటివ్ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. మెడికల్ థ్రిల్లర్ ఎప్పుడు కూడా గ్రేట్ కాంబినేషన్. ఈ కథ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. బాల్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హరి గౌర మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్టర్ కృష్ణకి ఆల్ ద వెరీ బెస్ట్. ఏదో ఒక వావ్ ఫ్యాక్టరీ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తున్నారు. ఈ సినిమాలో అలాంటి వావ్ ఫ్యాక్టర్ వుందనిపించింది. ఈ సినిమా థియేటర్స్‌లో చూడడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. అశ్విన్‌కు, నాకు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడకపోతే ఆరోజు గడవదు. నిజానికి అశ్విన్ గ్రౌండ్‌లోకి వస్తే నాకసలు నచ్చదు. తను బాదే బాదుడుకి బాలు పట్టుకుంటే చేతులు నొప్పిపుడతాయి. మా మధ్య ఎమోషనల్‌గా మంచి బాండింగ్ ఉంది. తను పాజిటివ్‌గా ఉంటాడు. ఈ సినిమా టీజర్ చాలాసార్లు చూశాను. హరీ గౌర ‘హనుమాన్’తో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో పేరు రావడం అంత ఈజీ కాదు. ఈ సినిమాకు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు కృష్ణ ఫ్రేమ్స్ చూస్తుంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్‌లా అనిపించలేదు. బాల్ రెడ్డి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తీశారనే విషయం ఈ టీజర్ చెప్పేస్తుంది. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్మకముందని తెలిపారు.
Also Read- PG Vinda: మళ్లీ పిజి విందానే.. మంచి చేస్తే అంతే!
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎవరూ ఊహించలేని పాయింట్ ఇందులో ఉంది. అది ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాను. మంచు మనోజ్‌కు థాంక్యూ సో మచ్. ఆయన వాయిస్ టీజర్‌కి ప్రాణం పోయడమే కాకుండా మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత గణపతి రెడ్డి పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనతో ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సినిమా కోసం అందరూ ఎంతగానో హార్డ్‌వర్క్ చేశారు. ఈ టీజర్ హిట్ డైరెక్టర్ శైలేష్ చేతుల మీదుగా లాంచ్ అయినందుకు హ్యాపీ. తమన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్. నాకు మాత్రం ఒక ఎమోషన్. తను నాకు గాడ్ గిఫ్ట్. తను నా జీవితంలో ఉండడం వెరీ లక్కీ. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు