Jayam Ravi: కోలీవుడ్ హీరో జయం రవిపై కొన్ని రోజులుగా ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. రీసెంట్‌గా సింగర్ కెనీషాతో కలిసి ఓ వేడుకలో ఆయన కనిపించిన తీరు.. ఆయనని వార్తలలో మరింతగా వైరల్ అయ్యేలా చేసింది. జయం రవి, కెనీషాలను అలా చూసిన ఆర్తీ రవి సోషల్ మీడియా వేదికగా అంతా పిల్లల కోసమే అనేలా ఓ ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన మెసేజ్ తర్వాత జయం రవిని అంతా తిట్టిపోస్తున్నారు. అందమైన భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. ఇదేం పని నీకు? అయినా విడాకులు కూడా రాకుండా, అప్పుడే ఇంకో అమ్మాయితో అలా పబ్లిక్ ఈవెంట్స్‌కు రావడమేంటి? అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూసిన జయం రవి.. తాజాగా ఓ సుదీర్ఘ లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. అందులో అన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై మాట్లాడటం ఇదే చివరి సారి అంటూ ఆయన స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ జయం రవి షేర్ చేసిన లేఖలో ఏముందంటే..
Also Read- PG Vinda: మళ్లీ పిజి విందానే.. మంచి చేస్తే అంతే!
‘‘ఈ స్టార్‌డమ్‌ని నేను నా హార్డ్ వర్క్‌తో సంపాదించుకున్నాను. వ్యక్తిగత లాభాల కోసమో, సానుభూతి కోసమో.. నా గత విహహాబంధాన్ని అస్సలు వాడుకోను. అలా చేయడానికి ఇదేం ఆట కాదు, జీవితం. చట్టానికి కట్టుబడి ఉన్నాను. చట్టపరంగా అన్ని పూర్తయిన తర్వాతే గౌరవంగా నా జర్నీని కొనసాగిస్తాను. ఇప్పుడిప్పుడే కొన్ని వేధింపుల నుంచి కోలుకుంటున్నాను. కొన్నేళ్లుగా నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయాను. నా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా ఎంతగానో ఆలోచించాను. ఇక చేసేది లేకే ధైర్యంగా వివాహ బంధం నుంచి బయటికి వచ్చాను. విడాకుల గురించి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్‌తో కూడా మాట్లాడాను. విడాకుల విషయంలో మౌనంగా ఉండటం కూడా తప్పేనని నాకిప్పుడు అర్థమవుతుంది.
All these years I was being stabbed in the back, now I’m only glad that I’m being stabbed in the chest..
First and Final One From My Desk !
With Love
Ravi Mohan
‘Live and Let Live’ pic.twitter.com/Z0VbFYSLjU— Ravi Mohan (@iam_RaviMohan) May 15, 2025
రీసెంట్‌గా ఓ వేడుకకు అటెండ్ అయిన తర్వాత నన్ను తక్కువ చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటన్నింటిని నేను ఖండిస్తున్నాను. కేవలం నిజాన్ని మాత్రమే నమ్ముతూ, తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వాళ్ల లాభం కోసం ఇందులో నా బిడ్డలను కూడా వాడుతున్నారు. నా బిడ్డల క్షేమం కోరుకుంటున్నాను. నా భార్య, బిడ్డల కోసం ఎంతో చేశాను. కొన్ని క్లిష్ట పరిస్థితుల అనంతరం నా భార్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాను. భార్య నుంచి మాత్రమే విడిపోవాలని అనుకున్నాను, నా బిడ్డలను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ల గురించే ఆలోచిస్తున్నాను.
Also Read- Adhire Abhi: ప్రభాస్‌ని ‘అరేయ్’ అంటోన్న అదిరే అభి! అసలు విషయమిదే!
కెనీషా విషయానికి వస్తే.. ఆమె నాకు స్నేహితురాలిగానే పరిచయమైంది. నేను బాధలో ఉన్నప్పుడు ఆమె నాకెంతో సపోర్ట్‌గా నిలిచింది. ఒక రాత్రి వేళ కట్టు బట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో తనే నాకు అండగా నిలబడింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత కూడా ఆమె వెనుకాడలేదు. ఆమె ఒక అందమైన భాగస్వామి. ఆమె గురించి, ఆమె వృత్తి గురించి ఎలా పడితే అలా మాట్లాడితే ఇకపై సహించేది లేదు.. అంటూ ఈ లేఖలో జయం రవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది. ఫైనల్‌గా జయం రవి, ఆర్తిల వ్యవహారం ఏమవుతుందో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే కోలీవుడ్ మీడియాకు మాత్రం కావాల్సినంత కవరేజ్ అయితే లభించిందన్నది మాత్రం నిజం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు