Prabhas and Abhi
ఎంటర్‌టైన్మెంట్

Adhire Abhi: ప్రభాస్‌ని ‘అరేయ్’ అంటోన్న అదిరే అభి! అసలు విషయమిదే!

Adhire Abhi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రజంట్ ప్రభాస్ రేంజ్ ఏంటో టాలీవుడ్, కోలీవుడ్‌ కాదు.. సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. ఆయనతో సినిమాలు చేసేందుకు అన్ని సినిమాల ఇండస్ట్రీల నుంచి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అలాంటి ప్రభాస్‌ని ఒక జబర్దస్త్ కమెడియన్ ‘అరేయ్’, ‘మామ’ అని పిలుస్తుంటే ఫ్యాన్స్‌కి కోపం రాకుండా ఉంటుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో, అందులో అదిరి అభి మాట్లాడే మాటలు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అసలేంటా వీడియో, ఏమా కథ అనేది? స్వయంగా అదిరే అభినే వివరణ ఇచ్చాడు. లేదంటే అభికి దబిడే దిబిడే అయ్యేది.

Also Read- Kingdom: నిర్మాత నోటి దూల.. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదా!

ముందుగా అదిరే అభి గురించి చెప్పుకుంటే.. జబర్దస్ట్ కమెడియన్‌గా తెలుగు వారందరికీ అదిరి అభి తెలుసు. జబర్దస్త్ షో‌లో టీమ్ లీడర్‌గా ఎన్నో స్కిట్స్ చేసి, ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు అభి. హైపర్ ఆది వంటివారిని వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత కూడా అదిరే అభికే దక్కుతుంది. అభినయ్ కృష్ణ అనేది ఆయన అసలు పేరు. స్కూల్‌లో ఆయన పేరు హరికృష్ణ. డా. సి. నారాయణ రెడ్డి ఆయన పేరును అభినయ్ కృష్ణగా మార్చారట. జబర్దస్త్‌కి వచ్చాక తన పేరును అదిరి అభిగా మార్చుకున్నాడట.

జబర్దస్ట్‌కి రాకముందు, డిగ్రీ చదివే టైమ్‌లో సినిమా ఇండస్ట్రీలో ట్రై చేద్దామని చెప్పి, రైటర్ జనార్ధన్ మహర్షిని కలవగా, అప్పుడాయన నీ స్టడీస్ మొత్తం పూర్తి చేసుకుని రమ్మని చెప్పి తిప్పి పంపించారట. అలా వెనక్కి వెళ్లిన అభి, స్టడీస్ మొత్తం పూర్తి చేసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట. అప్పుడే ‘ఈశ్వర్’ సినిమా ఆడిషన్స్ జరుగుతుంటే, అందులో తను చేసిన మిమిక్రీతో పాటు డ్యాన్స్ అందరికీ నచ్చడంతో ఆ సినిమాలో అభికి అవకాశం వరించిందని చెప్పుకొచ్చాడు.

Also Read- Web Series: ఓటీటీని షేక్ చేసిన ఆ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్.. డోంట్ మిస్!

ఇక ఈ సినిమాలో ఫస్ట్ డే ఫస్ట్ షాటే ప్రభాస్‌ని ‘అరె మామ’ అని పిలవాల్సి రావడంతో భయంతో గజగజ వణికిపోయానని చెప్పుకొచ్చాడు అభి. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిని అరెయ్ అనమంటారేంటి? అని చాలా ఇబ్బంది పడ్డాడట. అప్పుడు ప్రభాసే కలగజేసుకుని, ఏం కాదు, పిలువు.. మనమందరం కళాకారులం, ఇక్కడకు నటించడానికి వచ్చామని ధైర్యం చెప్పడంతో, అప్పుడు అలా పిలిచానని.. అదిరే అభి తన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అదన్నమాట ‘అరేయ్’ వెనుక ఉన్న అసలు విషయం. సో.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త శాంతించండి. ప్రస్తుతం అదిరి అభి సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ మధ్య హీరోగానూ ఆయన కొన్ని సినిమాలలో నటించారు. మరోవైపు బుల్లితెరపై తన ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..