Kingdom: ‘లైగర్’ పరాజయం తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో చేస్తున్న ‘కింగ్‌డమ్’పైనే ఉన్నాయి. ఇందులో అనుమానమే అవసరం లేదు. ఇటీవల పుట్టినరోజున వరసగా రెండు మూడు సినిమాలు ప్రకటించినా, ‘కింగ్‌డమ్’ సక్సెస్‌పైనే విజయ్ దేవరకొండ భవిష్యత్ ఆధారపడి ఉందన్నది మాత్రం నిజం. కానీ, ఈ సినిమా విషయంలోనూ విజయ్ దేవరకొండ తీవ్ర నిరాశనే ఫేస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు కారణం మాత్రం నిర్మాత నోటి దూలే అని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. (Kingdom Postponed)
Also Read- Web Series: ఓటీటీని షేక్ చేసిన ఆ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్.. డోంట్ మిస్!
ఇటీవల నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) మీడియా సమావేశం నిర్వహించి మీడియాపై ఏ విధంగా మాట్లాడారో తెలియంది కాదు. మా సినిమాలను ప్రమోట్ చేయకండి. మా మీద ఆధారపడి బతుకుతూ, వెనుకాల ఈ రాతలేంటి? అంటూ నాగ వంశీ బరస్ట్ అయిన విషయం తెలిసిందే. మీరు ప్రమోట్ చేయకపోతే మా సినిమాలు ప్రేక్షకులలోకి పోవా? ఎలా పోవో? ఎలా ప్రమోట్ చేసుకోవాలో? మాకు బాగా తెలుసు.. అంటూ లైన్ దాటి మాట్లాడారు. ఇప్పుడా ఎఫెక్ట్ సినిమాపై స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్‌గా ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించి ఓ పాట విడుదలైంది. ఆ పాటను అనిరుధ్ కంపోజ్ చేసి, పాడారు కూడా. అయినా కూడా ఆ పాటకు సరైన రీచ్ రాలేదు. కారణం మీడియా పట్టించుకోకపోవడమే. ఇప్పుడసలు విషయానికి వస్తే..
ఈ సినిమాను మే 30వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు జూలై 4వ తేదీకి వాయిదా వేశారు. అదేమంటే, దేశంలో ఇటీవల సంభవించిన ఊహించని ఘటనలని.. ఈ పరిస్థితుల్లో ప్రమోషన్స్, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. నిజంగా ఇది నమ్మేలా ఉందా? ఒకవైపు యుద్ధం జరుగుతున్నా కూడా, సినిమాలు విడుదలయ్యాయి. నాని ‘హిట్ 3’ సినిమా విడుదలై వంద కోట్ల క్లబ్‌లోకి కూడా చేరింది. ప్రతి వారం ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది. ఆపేసిన ఐపీఎల్ కూడా 17 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి.. వారు చెప్పే రీజన్ కరెక్ట్ కాదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read- Vijay Antony: విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
మరి అసలు కారణం ఏమిటని అనుకుంటున్నారా? ఈ సినిమాకు సరైన బిజినెస్ ఇంత వరకు జరగలేదని తెలుస్తుంది. ఏ ఏరియాలోనూ బిజినెస్ సరిగా జరగకపోవడంతో, సినిమాను వాయిదా వేశారనేలా టాక్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ ప్రజంట్ ట్రాక్ రికార్డ్‌తో పాటు, నాగ వంశీ మీడియాపై మాట్లాడిన మాటలు.. ఈ సినిమా బిజినెస్‌కు అంతరాయంగా మారాయని అంటున్నారు. మరి ఇందులో నిజం ఉందో, లేదో తెలియదు కానీ.. వాళ్లు వాయిదా వేయడానికి చెబుతున్న రీజన్ అయితే కరెక్ట్‌గా లేదనే వారు లేకపోలేదు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు