Damodar Rajanarsimha: సంగారెడ్డి నియోజక వర్గంలో రహదారుల అభివృద్ధి పనులకు రూ.90 కోట్లతో అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభం చేశారు.
పోతిరెడ్డిపల్లి (ఎన్ హెచ్ 65 ) రోడ్డు నుంచి భూలక్ష్మమ్మ, కలివేముల రోడ్డు, సదాశివపేట మండలం ఆత్మకూరు నుండి సింగూరు వరకు,కొండాపూర్ మండలంలోని మరే పల్లి నుచి సీత్రంకుంటకు గల వివిధ బీటీ రోడ్డు నిర్మాణాలకు ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ 15 గ్రామాల్లో రోడ్ల అనుసంధానంతో గ్రామస్థాయిలో సంపదను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బలమైన రవాణా వ్యవస్థ అవసరం అని ఇందులో భాగంగా గ్రామాల మధ్య రోడ్లను అనుసంధానించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Also read: Maharashtra Tiger Attack: రక్తం మరిగిన పులి.. దాడిలో నలుగురు మహిళలు మృతి..
గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు చేరువ అవడం, చిన్న పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటం, యువతకు ఉపాధి అవకాశాలు కలగడం వంటి పలు మార్గాల్లో సంపద సృష్టి జరుగుతుందనీ పేర్కొన్నారు.
రహదారులు పూర్తయితే గ్రామాల మధ్య రవాణా వేగ వంతమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. గ్రామాల మధ్య సరైన రవాణా మౌలిక సదుపాయాలు ఉంటే గ్రామీణ ప్రజల జీవనోపాధిలో గణనీయమైన మార్పు వస్తుందనీ పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, త్వరితగతిన ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.