Amala Paul: అవును పెళ్లికి ముందే తప్పు చేశా.. నా భర్త కూడా షాక్!
Amala Paul (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Amala Paul: అవును..పెళ్లికి ముందే ఆ తప్పు చేశా.. నా భర్త కూడా షాక్ అయ్యాడు!

Amala Paul: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, రిలేషన్ షిప్స్, డేటింగ్స్ సర్వ సాధారణమని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది నటీ నటులు వీటిపై సీక్రెట్ మెయింటెన్ చేస్తారు. గాసిప్స్ రూపంలో వారి వ్యక్తిగత విషయాలు బయటకు రావాల్సిందే తప్పా.. నేరుగా పంచుకోరు. అయితే ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ (Amala Paul) మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఏ విషయాన్నైనా ఆమె నేరుగా పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

నటి అమలాపాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ధనుష్ (Dhanush) వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాందించింది. అయితే గతంలో తమిళ దర్శకుడు విజయ్ (Director Vijay)ను పెళ్లి చేసుకున్న ఆమె.. మూడేళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే బిజినెస్ మెన్ జగత్ దేశాయ్ (Jagath Desai)తో ప్రేమలో పడి అతడ్ని రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ అమ్మడు.. షాకింగ్ విషయం బయటపెట్టింది.

Also Read: Pakistan War Statement: భారత్‌తో యుద్ధం.. తొలిసారి పెదవి విప్పిన పాక్.. ప్రాణ నష్టంపై కీలక ప్రకటన

తాను పెళ్లికి ముందే గర్భవతి అని వచ్చిన రూమర్లు నిజమేనని అమలాపాల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ప్రెగ్నెంట్ అయ్యాకనే తాను జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. దీంతో ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జగత్ తాను తొలుత గోవాలో కలిశామని అమలాపాల్ చెప్పింది. అయితే తాను హీరోయిన్ అన్న విషయాన్ని మెుదట జగత్ కు చెప్పలేదని ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆ తర్వాత తాను హీరోయిన్ అనే విషయాన్ని చెప్పానని.. అప్పుడు జగత్ షాక్ అయినట్లు తెలిపింది. అయితే నటిగా అవార్డ్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి జగత్ తెగ మురిసిపోయాడని పేర్కొంది.

Also Read This: Case Filed on Aghori: లేడీ అఘోరీ రాసలీలలు.. తెరపైకి మరో యువతి.. కేసు నమోదు

Just In

01

Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Homebound Movie: ఆస్కార్ 2026 టాప్ 15లో నిలిచిన ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్’..

Panchayat Elections: నేడు మూడో విడత పోలింగ్.. అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు!

Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు