Miss World Contestants (imagecredit:swetcha)
తెలంగాణ

Miss World Contestants: నేడు ఓల్డ్ సిటీలో సందడి చేయనున్న అందాల తారలు!

Miss World Contestants: నేడు హైదరాబాద్ పాత బస్తీని మిస్ వరల్డ్ పోటీదారులు 112 మంది సందర్శించనున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటలవరకు పర్యటిస్తారు. మిస్ వరల్డ్ ఈవెంట్ తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్ లో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లలో హైదరాబాద్ తో పాటు చార్మినార్,లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయబోతున్నారు.

లాడ్ బజార్ ప్రత్యేకత

నిజాం పాలనలో వెలసినలాడ్ బజార్ కు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బాంగిల్స్ రాజధానిగా ఈ ప్రాంతం సుప్రసిద్ధం. రంగురంగుల పేర్లు, మణులు, జరీ పనితో కూడిన సాంప్రదాయిక గాజులు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి పెళ్లి సీజన్లో ఇది జనాల ఆకర్షణకేంద్రం. ఇక్కడ నాణ్యమైన ముత్యాలు, నగలు సరసమైన ధరల్లో లభిస్తాయి. హస్తకళల హబ్ గా కూడా పేరుంది. చిత్రకళ, నకాశీ పని, ఇస్లామిక్ ఆర్ట్ వంటి సాంప్రదాయిక హస్తశిల్ప వస్తువులు ఇక్కడ లభిస్తాయి. ఇత్తార్ (సువాసనలు), ఖురాన్ ప్రతులు, సాంస్కృతిక వస్తువులతో ఇది ఇస్లామిక్ ఆర్ట్ కి ప్రతీకగా ఉంది. ఓల్డ్ సిటీ యొక్క ఇటుకల రోడ్లు, సజీవమైన దుకాణాలు, సాంస్కృతిక సువాసనలు ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తాయి.

Also Rrad: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ కు మరో అరుదైన గౌరవం!

చార్మినార్ ప్రత్యేకత

1591లో కుతుబ్ షాహీ రాజు ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్, హైదరాబాద్ సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగు మినార్లతో కూడిన ఈ స్మారకం ఇండో-ఇస్లామిక్ డిజైన్ కు నిదర్శనం. ప్లేగు నివారణ తర్వాత నగర స్థాపనకు గుర్తుగా నిర్మించబడింది. 56 మీటర్ల ఎత్తు, 45 మీటర్ల వెడల్పుతో ఇది హైదరాబాద్ కు “హార్ట్” గా ఉంది.మినార్ల పై నుంచి పాత నగరం, మక్కా మసీదు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు కోసం ప్రతిపాదించబడింది. ఇది నిజాం కాలం నుంచి నేటి వరకు హైదరాబాద్ ఐకాన్ గా ఉంది.

వంటకాలు ధమ్ కీ బిర్యానీ ప్రత్యేకం

చౌమొహల్లా ప్యాలెస్ లో మంగళవారం రాత్రి 6గంటల నుంచి 9 గంటల వరకు స్వాగత విందును సుందరీమణులకు ఏర్పాటు చేశారు.ఈ విందులో సంప్రదాయ వాద్య కచేరీ సైతం ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టూరిజంశాఖకు చెందిన అధికారులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ విందులో తెలంగాణకు చెందిన హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బెంగన్, పతర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపూరి, బాదుషా, గులాబ్ జామూన్ వంటకాలను పోటీదారులకు రుచి చూపించనున్నారు. అదే విధంగా యూరప్, ఆఫ్రికా, అమెరికా, కరేబియన్, ఆసియా ప్రాంతాల పోటీదారులు ఉండటంతో స్థానిక వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పాల్గొనే సందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆసియా వంటకాలలో సుషీ, డిమ్ సన్, థాయ్ గ్రీన్ కర్రీ వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్చెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరూ వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్, మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించనున్నట్లు సమాచారం. ఈ నెల 26న హైటెక్స్ లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

Also Read: Congress on Etela: ఈటల బతుకేంటో మాకు తెలుసు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్!

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?