Sumanth on Nagarjuna ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Sumanth on Nagarjuna: నాగార్జున గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టిన అక్కినేని సుమంత్

 Sumanth on Nagarjuna: తెలుగు హీరో అక్కినేని సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, చాలా కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు ‘అన‌గ‌న‌గా’ తో వచ్చేస్తున్నాడు. ఈ సిరీస్ ఈనెల 15న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, ఈ నేపథ్యంలోనే మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ కు గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని సుమంత్ నాగార్జున గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Also Read: IDBI Bank Recruitment: యువతకు గుడ్ న్యూస్.. బ్యాంక్ లో ఉద్యోగాలు .. వెంటనే, అప్లై చేసుకోండి!

నేను మీకు కొన్ని పేర్లు చెబుతాను.. మీ ఫ్యామిలీ వాళ్ళవి.. వాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పండి అని యాంకర్ అడగగా.. సుమంత్ ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావులో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ గురించి అడగగా .. ” చాలా కష్టం చెప్పడం.. ఒకటి కాదు చాలానే ఉన్నాయి. ఆయనతో నా బాండింగ్ చాలా వేరు. అంతే తండ్రి కొడుకులుగా ఉంటాము. ఇంచు మించు నేను ఆయనకు కొడుకులాగా పెరిగాను. ఎంత సంపాదించిన , ఎంత ఆస్తి ఉన్న చాలా సింపుల్ గా అంటారు అని చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున గురించి అడగ్గా.. చాలా సేపు ఆలోచించి నాకేం చెప్పాలో కూడా అర్దం కావడం లేదు. అంటే ఆయన గురించి కరెక్ట్ గా తెలీడం లేదు. నాగార్జున నటన పరంగా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయన చేసిన రోల్స్ అన్ని కొత్తగా ఉంటాయి. మా తాత గారు ఉన్న రోజుల్లో ఆయన చేసే వారు. ఇక ఇప్పుడు ఈ జనరేషన్ లో నాగార్జున చేస్తున్నాడంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!