Christina Z. Chongtu: అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు.
Telangana News

Christina Z. Chongtu: అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!

Christina Z. Chongtu: ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే ఏం చేయాలి? సంసిద్ధత ఎలా ఉండాలి? ఆసుపత్రుల మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? అనే అంశాలపై హెల్త్ సెక్రటరీ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ మీటింగ్‌కు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ అధ్యక్షత వహించారు.

తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ నాగిరెడ్డి, హెల్త్ డిపార్ట్ మెంట్ హెచ్ వోడీలు, వివిధ కౌన్సిల్ చైర్మన్ లు, కార్యదర్శులతో పాటు ఇండియాన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, తదితర ప్రతినిధులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు స్టాక్ ఉంచండి

మందులు, రీయోజెంట్స్, పరికరాలు, బ్లడ్ తదితర వాటిని ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ తో స్టాక్ ఉంచాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు పడకల లభ్యత, తగినంత మందులు, రియోజెంట్లు, వినియోగ వస్తువులు, రక్తం, పవర్ బ్యాకప్ మొదలైన వాటి పరంగా సిద్ధంగా ఉండాలని సెక్రటరీ సూచించారు.

ట్రామా కేర్, ఇన్ఫెక్షన్ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, సిబ్బంది ప్రాథమిక నైపుణ్​యాలను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం వరుసగా వెబినార్లను నిర్వహిస్తుందని, హెల్త్ కేర్ వర్కర్లంతా ఆ వెబినార్ లలో పాల్గొనాలని సూచించారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో కాల్స్ స్వీకరించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో, జిల్లా స్టాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Also Read: Maoists: మావోయిస్టుల చేతిలో మరో వ్యక్తి హత్య.. ఎక్కడంటే!

 

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!