Beerla Ilaiah On Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదేళ్ల బీఆర్ఎస్ పాపాలపైన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదని కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ మూడు ముక్కలు, నాలుగు చెక్కలుగా మారబోతుంది. పదేళ్లలో కవిత పదవులు అనుభవించి వేల కోట్ల దండుకుని ఆ రోజు మాట్లాడలేదు.
కానీ కవిత ఇప్పుడు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందని బీర్ల అయిలయ్య అన్నారు. బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట నడుస్తోందని, అందుకే కవితను బయటకు పంపించాలని చూస్తున్నారని అన్నారు. హరీష్ రావు, కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ చూస్తున్నారు.
Also Read: Minister Sridhar Babu: ఖైదీలు కూడా మనుషులే.. బాధ్యతాయుత పౌరులుగా వారిని మారుస్తాం!
పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నందు వల్లనే రైతు బంధు, సామాజిక తెలంగాణ విషయాలను కవిత మాట్లాడుతోందని అన్నారు. గతంలో విజయశాంతి, ఆలే నరేంద్ర పార్టీ నుంచి బయటకు పంపినట్లే కవిత కూడా బయటకు పంపుతారని అన్నారు.
తెలంగాణ ప్రజల కోసం కవిత జైలుకు పోలేదు లిక్కర్ స్కాం చేసి జైలుకు వెళ్లింది మీ నాన్న చేసిన అప్పులు, మీ అన్న చేసిన తప్పులను కవిత బయట పెట్టాలని ఆయన అన్నారు. పార్టీలో విలువ, గౌరవం లేకపోవడం వల్లనే కవిత మాట్లాడుతోందని, కరివేపాకులా కవితను పార్టీలో చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అరిగోస పడినప్పుడు కవిత మాట్లాడితే బాగుండేదని బీర్ల అయిలయ్య అన్నారు.