BRS Party (imagecredit:twitter)
తెలంగాణ

BRS Party: ఉప ఎన్నికలు వస్తే గులాబీ పరిస్థితి ఏంటి.. కరువైన బలమైన నాయకులు!

 BRS Party: బీఆర్ఎస్ అధిష్టానం పదేపదే ఎమ్మెల్యే పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని పదేపదే నేతలకు చెబుతూ దైర్యాన్ని కల్పిస్తుంది. కానీ ఈ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, నేతల సన్నద్ధం చేయడంపై దృష్టిసారించలేదు. ఉప ఎన్నికలు వస్తే ఎవరి బరిలో నిలుపుతారనేది కూడా చర్చకు దారితీసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీచేయాలంటే అంతే బలమైన నేత పార్టీకి అవసరం. కానీ ఆ నేత ఎవరు.. ఎవరికి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనేది ఇంకా పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నేతలు యాక్టీవ్ గా ముందుకు సాగుతున్నారు. ఒకవైళ బైపోల్ వస్తే ఎలా విజయం సాధిస్తారనేది ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సెగ్మెంట్లలో విజయం సాధించింది. అయితే పార్టీ అధికారం కోల్పోవడం, ప్రధానప్రతిపక్షానికి పరిమితం అయింది. దీంతో పది మంది బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. దానంతో పాటు పార్టీ మారిన మరో 9 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టులో విచారణ కొనసాగుతుంది. వారిపై వేటు తప్పదని ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతి సమావేశంలోనూ, మీడియా వేదికగానే నేతలు పేర్కొంటున్నారు.

Also Read: India Vs Pak War: ముగిసిన ఇండియా-పాక్ మధ్య యుద్ధం.. సంచలన ప్రకటన

పార్టీ కేడర్, నేతలు సన్నద్ధం కావాలని పిలుపు నిస్తున్నారు. విజయం బీఆర్ఎస్ దే అని నొక్కి చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులు ఎవరనేది ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం స్పష్టం చేయలేదు. ఆయా నియోజకవర్గాలకు ఇన్ చార్జీ బాధ్యతలు ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు పర్యవేక్షణ చేస్తున్నారు. జగిత్యాల బాధ్యతలను ఎమ్మెల్సీ కవిత, భద్రాచలం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బాన్సువాడ పై కేటీఆర్ ఇలా పలు నియోజకవర్గాలకు చెందినవారు కేడర్ ను సమన్వయం చేస్తున్నారు. కానీ ఇన్ చార్జీగా ఎవరిని నియమించలేదు. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా గట్టెక్కుతారని పార్టీ కేడర్ లోనే ఆందోళన వ్యక్తమవుతుంది.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలనే ‘సుప్రీం’ చేయడంతో

బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సుప్రీం చేసింది. ఆ నియోజకవర్గాల ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించింది. ఆ నియోజకవర్గాల్లో ఇతర నేతలకు జోక్యం లేకుండా పూర్తి అధికారాలు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగనివ్వలేదు. ఎవరైనా ఆ నియోజకవర్గాల్లో యాక్టీవ్ గా పనిచేసే వారిని రాజకీయంగా అణచివేశారనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి పార్టీలో చేరినవారికి పెద్దపీట వేశారు. దీంతో గ్రూపు రాజకీయాలకు దారితీసింది. అంతేకాదు పార్టీనుంచి ఒడిపోయినవారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో రాజకీయంగా సైలెంట్ అయ్యారు.

అయితే 2023లో పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో 10మంది ఎమ్మెల్యేలు చేరారు. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్ పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, కాలే యాదయ్య-చేవెళ్ల, ప్రకాశ్ గౌడ్-రాజేంద్రనగర్,గూడెం మహిపాల్ రెడ్డి-పటాన్ చెరువు, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, తెల్లం వెంకట్రావు-భద్రాచలం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి-గద్వాల, అరికెపూడి గాంధీ-శేరిలింగంపల్లి, సంజయ్ కుమార్-జగిత్యాల ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేను తట్టుకొని గెలిచే సమర్ధవంతమైన నాయకులు లేరని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు కాకుండా మరో నేతకు ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అయ్యేదని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన నష్టం జరిగేది కాదని సీనియర్ నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. పార్టీ చేసిన చిన్న తప్పిదం కారణంగానే నేడు గడ్డుపరిస్థితి ఎదుర్కొంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండు నియోజకవర్గాలకు మాత్రమే

పది నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలకు మాత్రమే ఆర్థికంగా బలమైన నేతలు ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మాజీ మంత్రి రాజయ్య, రాజేంద్రనగర్ నుంచి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాత్రమే ఉప ఎన్నికలు వస్తే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జీగా మన్నె గోవర్ధన్ రెడ్డిని నియమించినా పార్టీ పూర్తి అధికారులు ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో తరచూగా గ్రేటర్ కు చెందిన మాజీ మంత్రులు జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో బలమైన నేతలే లేరని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అలాంటి సమయంలో ఎలా ముందుకెళ్తారని పలువురు పార్టీ అధిష్టానంను ప్రశ్నిస్తున్నారు.

పార్టీపై అధిష్టానం ఫోకస్ పెడితేనే

బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టిసారించలేదు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టింది. కమిటీలు, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేదు. యాక్టీవ్ గా పనిచేసేవారికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో పార్టీలో బలమైన నేతలుగా ఎదగలేదు. అయితే ప్రస్తుతం ప్రధానప్రతిపక్షంలో ఉండటం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, గ్యారెంటీల అమలులో జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో కొంత అసహనం వ్యక్తమవుతుంది.

ఇది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో అధిష్టానం క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేయడంతో పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాలపై దృష్టిపెడితేనే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కానీ జాప్యం చేస్తే మాత్రం గడ్డు పరిస్థితి తప్పదని నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే అధిష్టానం ఎలా ముందుకెళ్తుంది.. పార్టీబలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీ కేడర్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Bandi sanjay: యుద్ధం ఎఫెక్ట్.. కశ్మీర్‌లో తెలుగు విద్యార్థులు.. స్పందించిన కేంద్ర మంత్రి!

 

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు