TG EAPCET Results (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TG EAPCET Results: గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా పొందండి!

TG EAPCET Results: తెలంగాణ రాష్ట్రంలో ఎప్‌సెట్ ఫలితాలు (EAPCET Results) విడుదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన నివాసంలో స్వయంగా ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించిన జేన్ టీయూ ఈ పరీక్షలు నిర్వహించగా.. తాజాగా రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.

మెుబైల్‌కే రిజల్ట్స్
ఎప్‌సెట్ పరీక్ష రాసిన విద్యార్థులు.. తమ ఫలితాలను https://eapcet.tgche.ac.in/ ​లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా ఏర్పాట్లు చేయడం విశేషం. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ఎంట్రెన్స్‌ పరీక్షలు పూర్తవగా.. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ విద్యార్థి టాపర్..
తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ విద్యార్థి టాపర్ గా నిలిచాడు. పార్వతీపురం మన్నం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర తొలి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ మాదాపూర్ కు చెందిన చరణ్ రెడ్డి రెండో ర్యాంక్, హేమసాయి సూర్య కార్తీక్ మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. టాప్ – 10 విద్యార్థుల్లో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం గమనార్హం. ర్యాంకుల వారీగా విద్యార్థుల జాబితా ఇలా ఉంది.

1. పల్లా భారత్ చంద్ర (మన్యం జిల్లా, ఏపీ)
2. చరణ్ రెడ్డి (మాదాపూర్, ఏపీ)
3. హేమసాయి (విజయనగరం, ఏపీ)
4. లక్ష్మీ భార్గవ్ (నాచారం, హైదరాబాద్)
5. వెంకట గణేష్ రాయల్ (మాదాపూర్, హైదరాబాద్)
6. సుంకర సాయి రిషాంత్ రెడ్డి (మదాపూర్, హైదరాబాద్)
7. రుష్మిత్ బండారి (మాదాపూర్, హైదరాబాద్)
8. స్వరూప్ కుమార్ (కాంచన్ బాగ్, హైదరాబాద్)
9. కొత్త ధనూష్ రెడ్డి (హైదరాబాద్)
10, కొమ్మ శ్రీ కార్తిక్ (మేడ్చల్, హైదరాబాద్)

ఒక్క అమ్మాయి మాత్రమే
అగ్రికల్చర్, ఫార్మా విభాగంలోనూ అబ్బాయిలోనూ అబ్బాయిలు పైచేయి సాధించారు. మెుదటి పది ర్యాంకుల్లో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉంది. టాప్ – 10 లిస్ట్ ఇలా ఉంది.

1. సాకేత్‌రెడ్డి (మేడ్చల్‌)
2. సబ్బాని లలిత్‌ వరేణ్య (కరీంనగర్)
3. అక్షిత్‌ (వరంగల్)
4. సాయినాథ్‌ (వనపర్తి)
5. బ్రాహ్మణి (మాదాపూర్‌)
6. గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)
7. అఖిరానంద్‌రెడ్డి (నిజాంపేట)
8. భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్‌)
9. శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)
10. అద్దుల శశికిరణ్‌రెడ్డి (బాలాపూర్‌)

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!