Wildlife Protection Act: జింక మాంసం స్వాధీనం!
Wildlife Protection Act( image credit: twitter)
Telangana News

Wildlife Protection Act: వన్యప్రాణి సంరక్షణ చట్ట ఉల్లంఘన.. జింక మాంసం స్వాధీనం!

Wildlife Protection Act: జింక మాంసం కలిగి ఉన్న ముగ్గురిని వెస్ట్ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి మూడు కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకీకి చెందిన హసన్​ బక్రన్​ (50) వ్యాపారి. అతని వద్ద జింక మాంసం ఉన్నట్టుగా సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిజామాబాద్​ అహమద్​ పురా కాలనీకి చెందిన తన స్నేహితుడు హమీద్​ బిన్​ హకానీ (54) నుంచి జింక మాంసాన్ని తీసుకున్నట్టుగా వెల్లడైంది. తీసుకున్న దాంట్లో నుంచి కొంత జింక మాంసాన్ని తన మరో మిత్రుడైన షేక్ అబ్దుల్​ రహమాన్​ (54)కు ఇచ్చినట్టు హసన్​ బక్రన్ చెప్పాడు.

 Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!

ఈ క్రమంలో టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. హమీద్​ బిన్​ హకానీని ప్రశ్నించగా మహారాష్ట్రకు చెందిన రిజ్వాన్​ అనే వ్యక్తి నుంచి ఈ మాంసాన్ని కొన్నట్టుగా చెప్పాడు. అరెస్ట్​ చేసిన ముగ్గురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?