Nani – Hit3: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. ఎందుకంటే, తన కెరియర్లో ఫ్లాప్స్ కంటే హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇటీవలే కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను డైరక్షన్లో నాని హిట్ 3 లో హీరోగా నటించాడు. నానికి జోడీగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మే 1 న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, తాజాగా ఈ మూవీకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైజాగ్ లో హీరోని చూడగానే వెంటనే హీరోయిన్ ప్రేమలో పడుతుంది. అసలు ఇలా చూసిన వెంటనే ప్రేమలో ఎలా పడుతుంది. కనీసం కొద్దీ రోజులైన పరిచయం ఉండాలి కదా.. వీరి మధ్య ఉండే రిలేషన్‌షిప్ సీన్స్ ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. విలన్ పాత్రలో చేసిన యాక్టింగ్ అందర్ని ఆకట్టుకుంది. హీరోనే పోలీస్ అన్న విషయం చూసే వాళ్ళకి కొత్తగా అనిపించింది. మూవీలో యాక్షన్ సీన్లు బాగానే తెరకెక్కించారు. ముఖ్యంగా, మధ్యలో వచ్చే ఫైట్ సీన్ ఆడియెన్స్ నీ థ్రిల్‌కి గురి చేస్తుంది. కానీ, క్లైమాక్స్‌కి ముందుగా హీరో 30 కత్తిపోటులకు గురైన కూడా మళ్లీ ఖడ్గంతో పోరాడుతుంటాడు. ఇది థియేటర్లో చూసే ప్రేక్షకులకు కూడా షాకింగ్ లాగా ఉంది. ఇది హీరోయిజం కోసం ఫైట్ చేసినా కానీ, ఆడియెన్స్ ను నమ్మించేలా లేదు.
Also Read: Ccl Recruitment 2025: నెలకు రూ.1.20 లక్షల జీతంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ పతాకం పై హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ చిత్రాన్ని నిర్మించారు. ” హిట్ 3 ” చిత్రానికి రూ.48 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్లను కలెక్ట్ చేయాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ మూవీ ఎనిమిది రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.51.89 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం రూ.93.62 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా బయ్యర్స్ కోట్లలో లాభాలు అందించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.