CM Revanth Reddy: ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు కేంద్రం చేస్తున్న చర్యలకు అంతా సహకరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. దేశమంతా ఏకమవ్వాలని పిలుపు నిచ్చారు. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్ లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ అని వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు.
Also Read: Bhatti Vikramarka: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం మీకోసమే!
దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. తామంతా శాంతిని ప్రోత్సహించే వాళ్లమేనని, కానీ దాన్ని చేతకాని తనంగా తీసుకొని దేశ ప్రజలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదన్నారు.
పెహల్గమ్ ఘటనతో తమ ఆడబిడ్డల సింధూరాలను ఉగ్రవాదులు తుడిచారని, వారికి ఆపరేషన్ సింధూర్ తోనే బుద్ధి చెప్పామన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు భారత సైన్యం నిర్వీరామంగా కృషి చేస్తుందన్నారు. వాళ్లకు తప్పకుండా మద్ధతుగా నిలుస్తామన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పద్ధతి మార్చుకోవాలని సీఎం సూచించారు. భారత దేశానికి ముప్పు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు