Raghava Lawrence: రాఘవ లారెన్స్ గురించి, ఆయనకున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక పాత్రలను పోషించి, అన్నింటిలోనూ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం హీరోగా ఆయన సినిమాలు చేస్తున్నారు. అలాగే తన ఇష్టదైవం రాఘవేంద్రస్వామి గుడి కట్టించి నిత్యం పూజలు జరిపిస్తున్నారు. ఇక ఎవరైనా కష్టంలో ఉంటే చాలు వెంటనే కరిగిపోయే లారెన్స్, ఇటీవల ఎంతో మందికి సాయం చేశారు. రైతులకు ట్రాక్టర్స్ కొనిచ్చారు. ఇలా ఒక్కటేమిటి? కష్టమని తన వరకు ఎవరైనా వస్తే.. వెంటనే వారికి సాయం చేస్తూ.. రాఘవ లారెన్స్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
Also Read- Manchu Lakshmi: మంచు మనోజ్‌ని అంత మాట అనేసిందేంటి? ఇదన్నమాట మ్యాటర్!
తాజాగా మరోసారి రాఘవ లారెన్స్ పేరు వైరల్ అవుతోంది. కారణం ఓ కూలి పని చేసుకునే ఫ్యామిలీకి ఆయన అందించిన సహాయమే. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త, తన వరకు రావడంతో వెంటనే రియాక్ట్ అయిన లారెన్స్, ఆ కుటుంబం పోగొట్టుకున్న రూ. లక్ష రూపాయలను బాక్సులో పెట్టి మరీ ఇచ్చారు. తను ఇస్తే ఏం అనుకుంటారో అని, తన ఇష్ట దైవం రాఘవేంద్రస్వామి దగ్గర ఆ బాక్స్ ఉంచి, ఆ ఫ్యామిలీని డైరెక్ట్‌గా ఆ స్వామి దగ్గర నుంచి ఆ బాక్స్‌ని తీసుకోవాలని కోరారు. ఆ బాక్సులో ఏముందో చూసి, ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అసలు విషయం ఏమిటంటే.. శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, భార్య ముత్తుకరుప్పి కూలీలుగా పని చేస్తూ, తమ ముగ్గురు పిల్లల చెవిపోగుల కోసం కొంత డబ్బు దాస్తూ వస్తున్నారు. అందుకోసం వారు ఒక బాక్సులో మనీని పెట్టి, ఇంట్లో ఒక గొయ్యి తవ్వి, అందులో బాక్స్‌ను దాచి పెట్టారు. రీసెంట్‌గా ఆ బాక్సును తీసి, డబ్బును లెక్కపెట్టుకోగా, రూ. లక్ష రూపాయలు ఉన్నట్లుగా గమనించారు. దానికి తోడు మరికొంత డబ్బులని పోగు చేయాలని భావించి, మరోసారి అక్కడే ఆ బాక్సును గోతిలో పెట్టి కప్పేశారు. తీరా ఇప్పుడు చూస్తే, ఆ బాక్సులో ఉన్న డబ్బుకి చెదలు పట్టేసి, ముక్కలు ముక్కులైపోయాయి. చెద పురుగులు ఆ డబ్బులను తినేయడం చూసి వారి గుండె పగిలినంత పనైంది.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుల ఫిర్యాదు
అందులో ఉన్న 500 రూపాయల నోట్లన్నీ చెద పురుగులు తినేశాయి. ఏడాది పాటు కష్టపడి, దాచుకున్న సొమ్ము అలా అయిపోవడంతో, ఆ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమైంది. కొందరు ఆ ఫ్యామిలీ బాధని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఆ వీడియో లారెన్స్ వరకు వెళ్లడంతో వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. ఆ ఫ్యామిలీని తన దగ్గరకు తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. చివరకు ఆ ఫ్యామిలీ తన దగ్గరకు రావడంతో, వారు పోగొట్టుకున్న రూ. లక్షను బాక్సులో పెట్టి మరీ ఇచ్చారు.
Hi Everyone, I came across the news that a coolie family lost 1lakh of their many years of savings due to termites. My heart sank thinking about what they must’ve gone through. So, I’m happy to contribute the lost money for them. Thanks to the media and people involved in… pic.twitter.com/Rmhv3VNBNV
— Raghava Lawrence (@offl_Lawrence) May 8, 2025
ఆ కూలి పని చేసుకునే వాళ్లకి డబ్బులు ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లారెన్స్.. కూలి పని చేసి దాచుకున్న డబ్బును చెదలు తినేసిన వార్త నా దృష్టికి వచ్చింది. ఆ ఫ్యామిలీ పడుతున్న బాధ నా హృదయాన్ని కలచివేసింది. వాళ్లు ఏదైతో కోల్పోయారో.. దానిని నేను తిరిగి ఇచ్చినందుకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీడియా, ప్రజలకు నా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు