Ponnam Prabhakar: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే విద్యార్ధుల భవిష్యత్ ను తీర్చిదిద్దే బాధ్యత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ దే నంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)పేర్కొన్నారు. ఆయన సెక్రటేరియట్ లో నూతనంగా నియామకమైన 132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. కొత్తగా బీసీ సంక్షేమ శాఖ కుటుంబంలో చేరుతున్న ఉద్యోగాలకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్ధులకు కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేస్తూ వారి భవిష్యత్ కు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. ఉపాధ్యాయ,డాక్టర్,జర్నలిజం, రాజకీయాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వృత్తిలో గౌరవం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 703 హాస్టల్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. డిసెంబర్ 7 వ తేదీ 2023 ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాల లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటి నెరవేరస్తూ ముందుకు పోతున్నామన్నారు. మెస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. చాలా ఏళ్ల తరువాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నియామకాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ , కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు,కార్పొరేషన్ చైర్మన్ లు ముత్తినేని వీరయ్య, నూతి శ్రీకాంత్ గౌడ్ , మెట్టు సాయికుమార్ ,జైపాల్ , జ్ఞానేశ్వర్ , కాల్వ సుజాత తదితరులు ఉన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు