Trisha Krishnan (image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Trisha Krishnan: వామ్మో.. 42 ఏళ్లలో ఇంత మంది ప్రియులా? దానికి కారణమిదే!

Trisha Krishnan: సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. తెలుగు, తమిళ ప్రేక్షకుల మనస్సుల్లో ఈ అమ్మడు చెరగని ముద్ర వేసింది. ఎంతో మందికి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఒకప్పుడు త్రిష పేరు చెబితే టాలీవుడ్ ప్రేక్షకులు ఊగిపోయేవారు. ఆమె అందం, ఎక్స్ ప్రెషన్స్, అభినయానికి ఫిదా అయిపోయేవారు. కొత్తగా ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా త్రిషకు ఉన్న క్రేజ్ ను బీట్ చేయలేరని ఆమె అంటుంటారు. అయితే ఈ నెల ప్రారంభంలోనే త్రిష తన 42వ పుట్టిన రోజును జరుపుకుంది. ఎంతో అందంగా ఉండే త్రిష ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకపోవడం ఆమె ఫ్యాన్స్ ను బాధిస్తోంది. కానీ గతంలో ఆమె చాలా మంది హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం.

పలువురితో ప్రేమాయణం
స్టార్ హీరోయిన్ త్రిష.. 1999లో వచ్చిన జోడి సినిమాతో నటిగా మారింది. 2002లో వచ్చిన తమిళ చిత్రం మౌనం పెసియాదే (Mounam Pesiyadhe) హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా ఆమె తొలి చిత్రం మంచి విజయం సాధించడంతో కెరీర్ పరంగా త్రిషకు తిరుగులేకుండా పోయింది. అయితే సినిమాల సంఖ్య పెరుగుతున్న క్రమంలోనే ఆమె ఇష్టపడిన హీరోల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చిందని టాక్ ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ జాబితాలో త్రిష టాప్ ఉంటుందన్న విమర్శ సైతం ఉంది.

ప్రభాస్ తో లవ్?
కెరీర్ తొలినాళ్లలో హీరో ప్రభాస్ తో కలిసి త్రిష చాలా సినిమాలే చేసింది. వారి కాంబోలో పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడు వంటి చిత్రాలు వచ్చాయి. ఆ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో త్రిషకు మన డార్లింగ్ ఎంగేజ్ మెంట్ రింగ్ సైతం తొడికారని పుకార్లు వచ్చాయి. ఏమైందో ఏమోకానీ వారి లవ్ వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే మళ్లీ కోలీవుడ్ లోకి వెళ్లిన త్రిష అక్కడ బిజీగా మారిపోయింది.

ఆ తమిళ హీరోలు సైతం!
అక్కడ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో త్రిష లవ్ ట్రాక్ నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు సైతం ఎక్కబోతుందంటూ గాసిప్స్ వినిపించాయి. మరి వీరి మధ్య ఏ విషయంలో విభేదాలు వచ్చాయో తెలియదు కానీ కొన్నాళ్లకే వారు విడిపోయారు. ఆ తర్వాత మరో నటుడు శింబుతో త్రిష ప్రేమలో పడినట్లు టాక్ వినిపించింది. అప్పట్లో ఈ జంట పబ్స్ లో తెగ దర్శనమిచ్చింది. కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మరో తమిళ హీరో ధనుష్ తో ప్రేమలో పడినట్లు కథనాలు వచ్చాయి. అది కూడా ఎంతో కాలం నిలవలేదు.

Also Read: High Security in Hyderabad: హైదరాబాద్ లో హైఅలర్ట్.. ఎక్కడ చూసినా బలగాలే.. ఏం జరుగుతోంది!

ఆ హీరో మళ్లీ ప్రేమ?
ఈ క్రమంలోనే మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టిన త్రిష.. యంగ్ హీరో దగ్గుబాటి రానాను ఇష్టపడినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరు కలిసి ఉన్న పొటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తోనూ ఈ అమ్మడు డేటింగ్ చేసినట్లు రూమర్లు వచ్చాయి. దీనిని త్రిష ఖండించినట్లు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. అయితే ఆ రెండు రిలేషన్స్ కు త్రిష బ్రేకప్ చెప్పేసినట్లు టాక్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ తో మళ్లీ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వారిద్దరు డీప్ లవ్ లో ఉన్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది.

పెళ్లి అందుకే చేసుకోలేదా?
మెుత్తం మీద ఇంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపినా ఇప్పటికీ త్రిష పెళ్లి చేసుకోకపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇంతమంది హీరోలను ఇష్టపడినప్పటికీ ఏ రిలేషన్ కూడా పెళ్లి వరకూ వెళ్లకపోవడంతో మ్యారేజ్ పై త్రిషకు నమ్మకం పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?